‘ఆగడు’ ఆడియో రిలీజ్ డేట్ మారింది
హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆగడు చిత్రం ఆడియో విడుదల తొలుత ఆగస్టు 28న ప్లాన్ చేసారు. అయితే తాజాగా ఆడియో రిలీజ్ డేట్ ఆగస్టు 30కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక ఆడియో వేడుకకు వేదిక కానుంది. ఈ సెలబ్రేషన్స్ లో అభిమానులు కీలక పాత్ర పోషించనున్నారు. ఇప్పటికే ఆగుడు మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనే అవకాశం అభిమానులకు కల్పించిన సంగతి తెలిసిందే. ఎంట్రీలు పంపిన అభిమానులను ఎంపిక చేసి మూవీ ప్రమోషన్స్ లో భాగస్వాములను చేయనున్నారు.

మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా విడుదలైన 'ఆగడు' చిత్రం సెకండ్ టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే 'ఆగడు' చిత్రానికి ఓపెనింగ్స్ బీభత్సంగా ఉంటుందని స్పష్టమవుతోంది. ఈ టీజర్ చూస్తుంటే 'ఆగడు' చిత్రం పూర్తి వినోదాత్మకంగా సాగే యాక్షన్ ఎంటర్టెనర్ అని స్పష్టం అవుతోంది. ఇక మహేష్ బాబు ప్రతి డైలాగులోనూ పంచ్ లు వేస్తూ అభిమానులను అలరించనున్నారు. 'నువ్వు డైలాగ్ వేస్తే కౌంటర్ వేయడానికి నేను రైటర్ ను కాదు ఫైటర్ ను' అంటూ మహేష్ బాబు చెప్పిన పంచ్ డైలాగ్ సెకండ్ టీజర్ కు హైలెట్ అయింది. మొత్తానికి మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఈ టీజర్ చూసి పుల్ హ్యాపీగా ఉన్నారు.
వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఆగడు చిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా నటిస్తోంది. శృతి హాసన్ ఐటం సాంగు చేయడం మరో ప్రత్యేకత. తమన్ సంగీతం అందించారు. 'దూకుడు' వంటి భారి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ బాబు, శ్రీను వైట్ల, తమన్ కాంబినేషన్లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాపై అభిమానులలో భారి అంచనాలున్నాయి.
ఈ చిత్రానికి అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు. సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలో పాటల చిత్రీకరణ కోసం యూరఫ్ వెళ్లనున్నారు. నార్వే తో పాటు పలు ప్రాంతాల్లో పాటల చిత్రీకరణ జరుగనుంది.


Click it and Unblock the Notifications











