పండగ చేసుకుందాం: మహేష్ బాబు భంగిమ అర్థం అదే!

By Bojja Kumar

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆగడు' చిత్రం ఆడియో ఆగస్టు 30న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం ఆడియో రిలీజ్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్లో మహేష్ బాబు సరికొత్త స్టైలిష్ భంగిమతో ఆకట్టుకుంటున్నారు. రేపు ఆడియో పండగ చేసుకుందాం! అనే విధంగా ఆయన ఫోజు ఉందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.

హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక ఆడియో వేడుకకు వేదిక కానుంది. ఈ సెలబ్రేషన్స్ లో అభిమానులు కీలక పాత్ర పోషించనున్నారు. వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఆగడు చిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా నటిస్తోంది. శృతి హాసన్ ఐటం సాంగు చేయడం మరో ప్రత్యేకత. తమన్ సంగీతం అందించారు.

Aagadu audio release tomorrow

'దూకుడు' వంటి భారి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ బాబు, శ్రీను వైట్ల, తమన్ కాంబినేషన్లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాపై అభిమానులలో భారి అంచనాలున్నాయి. ఈ చిత్రానికి అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు. సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X