మహేష్ ఫ్యాన్స్ వీక్‌నెస్: బెనిఫిట్ షో పేరుతో భారీగా బాదుడు?
హైదరాబాద్: అందరి కంటే ముందు తమ ఫేవరెట్ హీరో మహేష్ బాబు సినిమా చూడాలనే ఫ్యాన్స్ వీక్ నెస్‌ను బెనిఫిట్ షోల పేరుతో నిర్వాహకులు క్యాష్ చేసుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నారు కొందరు ఫ్యాన్స్. బెనిఫిట్ షోకు డిమాండ్ పెరగడంతో....నిర్వాహకులు రేట్లు కూడా భారీగానే పెంచేసినట్లు సమాచారం. కొన్ని టిక్కెట్స్ అత్యధికంగా రూ. 2000 వేల వరకు అమ్మినట్లు తెలుస్తోంది.
మహేష్ బాబు సినిమా చూడాలనే అభిమానంతో కొందరు ఎంత ఖర్చయినా పెట్టడానికి ముందుకు వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే....బెనిఫిట్ షోల ద్వారా వచ్చే ఆదాయాన్ని చారిటీకి ఉపయోగిస్తారని కొందరు చెబుతున్నప్పటికీ....అందులో నిజం ఎంత అనే దానిపై కచ్చితమైన సమాచారం లేదు. హైదాబాద్ మూసాపేటలోని శ్రీరాములు థియేటర్లో తెల్లవారు ఝామున 6 గంటలకు, గుంటూరు జిల్లా పొన్నూరులోని శ్రీలక్ష్మి థియేటర్లో తెల్లవారు ఝామున 4 గంటలకు బెనిఫిట్ షోలు వేస్తున్నట్లు సమాచారం.

ఆగడు సినిమా విషయానికొస్తే....ఘట్టమనేని రమేష్ బాబు సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రేపు (సెప్టెంబర్ 19)న గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈచిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్.
దూకుడు లాంటి భారీ విజయం తర్వాత మహేష్ బాబు-శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. అంచనాలకు తగిన విధంగా ఈ చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకున్న ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2వేల థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. సినిమా విడుదల కోసం మహేష్ బాబు అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











