ఫ్యామిలీ ప్రేక్షకులు సేఫ్... ‘ఆగడు’ సెన్సార్ రిపోర్ట్

By Bojja Kumar

హైదరాబాద్: మహేష్ బాబు నటించిన ‘ఆగడు' చిత్రాన్ని ఈ నెల 19న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. అంటే పెద్దలతో పాటు పిల్లలు కూడా వెళ్లి ఈ సినిమా నిరభ్యరంతంగా చూడొచ్చని అర్థం.

ఈ మధ్య పలువురు స్టార్ హీరోల సినిమాల్లో హింస, రొమాన్స్ శృతి మించుతుండటంతో సెన్సార్ బోర్డు A(పెద్దలకు మాత్రమే) సర్టిఫికెట్ జారీ చేస్తున్న నేపథ్యంలో.....ఫ్యామిలీ ప్రేక్షకులు ‘ఆగడు' సెన్సార్ రిపోర్టు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేయడంతో ఫ్యామిలీ ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు.

‘ఆగుడు' సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది నిర్మాతలు సినిమా ప్రమోషన్స్ ముమ్మరం చేసారు. మరో వారంలో ‘ఆగడు' విడుదల కానుండటంతో తాజాగా అన్ని థియేటర్లలో...కొత్త థియేట్రికల్ ట్రైలర్ ప్రదర్శనకు ఏర్పాట్లు చేసారు. తాజాగా ఈ ట్రైలర్ యూట్యూబులో కూడా విడుదల చేసారు 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ వారు.

‘ఆగడు' సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు దక్కించుకున్న ‘ఈరోస్ ఇంటర్నేషనల్' సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత ఎక్కువ థియేటర్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ భాగస్వామ్యంతో ఈ నెల 19న ‘ఆగడు' సినిమాను విడుదల చేస్తామని, నాలుగు దక్షిణాది భాషల్లో రికార్డు స్థాయిలో 2000 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ఈరోస్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

హైదరాబాద్

ఇంతకు ముందు ‘1-నేనొక్కడినే' చిత్రం ద్వారా ఒరిగింది ఏమీ లేక పోయినా....‘ఆగడు' చిత్రంపై ఈరోస్ సంస్థ భారీ అంచనాలు పెట్టుకుంది. ఈరోస్ సంస్థ ఎండి సునీల్ లుల్లా మాట్లాడుతూ...‘మహేష్ బాబు సినిమా విడుదల కోసం 14 రీల్స్ సంస్థతో చేతులు కలపడం చాలా ఎగ్జైటెడ్‌గా ఉంది. భారీ తారాగణం. మంచి వినోదాత్మక చిత్రం. మహేష్ బాబు-శ్రీను వైట్ల కాంబినేషన్ బాక్సాఫీసు వద్ద మ్యాజిక్ చేస్తుందనే నమ్మకం ఉంది' అన్నారు.

‘ఆగడు' చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ దాదాపు 55 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే సినిమా విడుదల ముందే భారీగా బిజినెస్ జరిగింది. శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇలా అన్నీ కలిపి ఇప్పటికే రూ. 75 కోట్ల వరకు నిర్మాతలకు ముట్టాయని అంటున్నారు.

ఈచిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్. 'దూకుడు' వంటి భారి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ బాబు, శ్రీను వైట్ల, తమన్ కాంబినేషన్లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఇది. అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X