మహేష్ మాట మీదే ఉన్నాడు..మారలేదు
హైదరాబాద్ : మహేష్ బాబు తాజా చిత్రం 'ఆగడు' ని శరవేగంగా ముస్తాబు చేస్తున్నారు. ఈ చిత్రం విడుదల వాయిదా పడుతుందని అనుకున్నారు. కానీ గతంలో అనుకున్నట్లుగానే దసరా ఉత్సవాల ని దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ 26 న విడుదల చేయాలనే నిర్ణయానికే పూర్తిగా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దర్శక,నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల తొమ్మిదిన మహేష్ జన్మదినం సందర్భంగా 'ఆగడు' రెండో ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తారని సమాచారం. ఈ మేరకు వర్క్ జరుగుతోందని సమాచారం.
ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలోని కొండ ప్రాంతంలో 'ఆగడు' క్లైమాక్స్ సన్నివేశాల షూటింగ్ జరుగుతోంది. విజయ్ మాస్టర్ నేతృత్వంలో మహేష్‌బాబు, సోనూసూద్‌పై ఫైట్ చిత్రీకరిస్తున్నారు. ఈ నెల ఎనిమిది వరకు ఇక్కడే చిత్రీకరణ ఉంటుంది. ఇది చూసినవారు మహేష్ ఒంటి మీద పోలీసు డ్రెస్ పడితే ఇక సినిమా రచ్చ రచ్చే అంటున్నారు.

చిత్రంలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, వెన్నెల కిషోర్,బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు హిలేరియస్ గా ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రంలో మహేష్ తొలిసారిగా రాయలసీమ యాస మాట్లాడుతూ తుపాకీ ఎక్కుపెట్టబోతున్నారు. 'ఆగడు'లో ఆయన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నట్టు సమాచారం. మహేష్, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రమిది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.
'దూకుడు' తర్వాత మహేష్, శ్రీను వైట్ల కలయికలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల్ని అందుకొనేలా 'ఆగడు'ని రూపొందిస్తున్నట్టు సినిమావర్గాలు చెబుతున్నాయి. మహేష్ శైలి వినోదం, యాక్షన్ అంశాల మేళవింపుతో సాగే ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
డా.రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, నెపోలియన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: అనీల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, రచనా సహకారం: ప్రవీణ్ వర్మ, సంగీతం: ఎస్.ఎస్.థమన్, సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, ఆర్ట్: ఎఎస్ ప్రకాష్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, కో-డైరెక్టర్: చలసాని రామారావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కోటి పరుచూరి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీను వైట్ల.


Click it and Unblock the Notifications











