‘ఆగడు’ వివాదం: క్షమాపణలు చెప్పిన ప్రకాష్ రాజ్
హైదరాబాద్: నటుడు ప్రకాష్ రాజ్‌కు సంబంధించిన 'ఆగడు' చిత్ర వివాదం గత కొంతకాలంగా పరిశ్రమలో చర్చనీయాంశం అయింది. ఆగడు సినిమా షూటింగ్ సందర్బంగా అసిస్టెంట్ డైరెక్టర్ పట్ల ప్రకాష్ రాజ్ దురుసుగా, అసభ్యంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతన్ని సినిమా నుండి తొలిగించారు. ఆయన స్థానంలో సోనూ సూద్‌ను తీసుకున్నారు.
ప్రకాష్ రాజ్ ఆగడాలు రోజు రోజుకు ఎక్కువవుతుండంతో ఈ విషయాన్ని ఈ సారి సీరియస్‌గా తీసుకున్నారు తెలుగు సినీ పరిశ్రమ వర్గాలు. దర్శకుల సంఘంలో అతనిపై ఫిర్యాదు కూడా చేసారు. ఈ క్రమంలో ఆయనపై నిషేదం విధించాలని కూడా నిర్ణయించారు. అయితే ఎట్టకేలకు ప్రకాష్ రాజ్ బేషరతుగా క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమనిగినట్లు తెలుస్తోంది.

ప్రకాష్ రాజ్ క్షమాపణ చెప్పడంతో మా డైరెక్టర్స్ అసోసియేషన్స్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఇతర సంఘాలు శాంతించాయని, మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించి ఆయన్ను వదిలేసినట్లు తెలుస్తోంది. ఒక వేళ ప్రకాష్ రాజ్ క్షమాపణ చెప్పకపోయి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని అంటున్నారు.
పట్టుదల, పంతానికి పోతే నష్టం తనకే అని భావించిన ప్రకాష్ రాజ్....తాను చేసింది తప్పే, అందుకు బేషరతుగా క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించినట్లు సమాచారం. కాగా...ఇటీవల మీడియా ముందుకు వచ్చిన ప్రకాష్ రాజ్ తాను ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పుకునే ప్రయత్నం చేసారు. అయితే ప్రకాష్ రాజ్ మీడియాకెక్కడంతో పరిశ్రమలోని కొందరు పెద్దలు....ఆతనిపై సీరియస్ అయినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











