»   » 'ఆగడు' డైలాగ్స్ గురించి వెన్నెల కిషోర్

'ఆగడు' డైలాగ్స్ గురించి వెన్నెల కిషోర్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Vennela Kishore
హైదరాబాద్ : మహేష్‌బాబు, శ్రీనువైట్ల కలయికలో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'ఆగడు'. తమన్నా హీరోయిన్. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ సారధి స్టూడియోస్ లో చిత్రీకరణ జరుగుతోంది. పిభ్రవరి ఆరు వరకూ ఈ చిత్రం షూటింగ్ జరగనుంది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఆయన ఈ చిత్రం గురించి ట్వీట్ చేసారు.

వెన్నెల కిషోర్ ట్వీట్ చేస్తూ... "కొన్ని రోజుల నుంచి నవ్వులతోనే రోజు ప్రారంభమవుతున్నాయి. అవును..నేను ఆగడు షూటింగ్ లోనే ఉన్నాను. ముఖ్యంగా డైలాగులు హిలేరియస్ గా ఉన్నాయి. నవ్వును కంట్రోలు చేసుకోవటం చాలా చాలా కష్టంగా ఉంది. ," అన్నారు.

ఇక మహేష్ బాబు... ''శ్రీను వైట్ల దర్శకత్వంలో మళ్లీ సినిమా చేయడం ఆనందంగా ఉంది. 'దూకుడు'కి ఏ మాత్రం తగ్గదు...ఈ 'ఆగడు'' అంటున్నారు. ఎంటర్టెన్మెంట్ విషయంలో 'ఆగడు' చిత్రం గతంలో తమ కాంబినేషన్లో వచ్చిన 'దూకుడు' చిత్రానికి డబల్ డోస్‌లా ఉంటుందని శ్రీను వైట్ల ఇప్పటికే స్పష్టం చేసారు. అందుకు తగిన విధంగానే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.

దర్శకుడు చెబుతూ ''పూర్తి వాణిజ్య విలువలతో తెరకెక్కిస్తున్న చిత్రమిది. మహేష్‌ పాత్ర చిత్రణ కొత్తగా అనిపిస్తుంది''అన్నారు. ''దూకుడు కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం అందరి అంచనాలనూ అందుకొంటుంది''అని నిర్మాతలు చెప్పారు.ఈ చిత్రంలో మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసిన వేసవి కానుకగా సినిమాను వచ్చే ఏడాది మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మహేష్ బాబు-శ్రీను వైట్ల కాంబినేషన్లో ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉండనున్నాయి. సంక్రాంతికి 'నేనొక్కడినే' అంటూ ప్రేక్షకుల్ని పలుకరించాడు మహేష్‌బాబు. ఇప్పుడు మళ్లీ షూటింగులతో బిజీ అయిపోయాడు.
హైదరాబాద్‌, గుజరాత్‌లలో చిత్రీకరణ జరుపుతారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

English summary
Vennela Kishore tweeted his experience with “Aagadu” film saying, “Some days start with a laugh n they never stop..yes..m in Aagadu shoot n the scenes esp dialogues r hilarious.Hard time controlling laughter,”.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu