కొత్తగా ఉంది : 'ఆగడు' టీజర్ కి టీజింగ్ ఇమేజ్ (ఫొటో)
హైదరాబాద్ : మహేష్ 'ఆగడు' తొలి టీజర్ ని రేపు(మే 31)న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో మహేష్ ఫ్యాన్స్ ని కూడా ఈ ఫస్ట్ లుక్ ఫెస్టివల్ లో పాల్గొనేలా చేయాలని నిర్మాతలు ప్లాన్ చేసారు. ఈ మేరకు వారు ఇసుకలోంచి గాల్లోకి లేస్తున్న ఓ జీపు ఇమేజ్ తో ఓ పోస్టర్ ని వేసి, అభిమానులను సిద్దంగా ఉండమని ఎనౌన్స్ చేసారు. అంతేకాకుండా మీరు,మేము అందరం కలిసి ఈ ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేద్దాం ఆన్ లైన్ ద్వారా అని తెలియచేస్తూ ఆగడు వెబ్ సైట్ ఎడ్రస్ ని ఇచ్చారు.

మహేష్‌బాబు - శ్రీనువైట్ల కలయిక మరోసారి 'ఆగడు' సినిమాతో పునరావృతం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పోలీసు పాత్రతో మరోసారి ప్రతాపం చూపించబోతున్నారు మహేష్‌బాబు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని మార్చి 31 న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలియచేసారు. అదే రోజున సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. తన తండ్రి పుట్టిన రోజు ని పురస్కరించుకుని గత కొంత కాలంగా తన చిత్రాల ఫస్ట్ లుక్ లని ఆ రోజున విడుదల చేస్తూ ఆభిమానుల ఆదరణ పొందుతున్నారు.
ఈ చిత్రంలో మహేష్ తొలిసారిగా రాయలసీమ యాస మాట్లాడుతూ తుపాకీ ఎక్కుపెట్టబోతున్నారు. 'ఆగడు'లో ఆయన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నట్టు సమాచారం. మహేష్, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రమిది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.

'దూకుడు' తర్వాత మహేష్, శ్రీను వైట్ల కలయికలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల్ని అందుకొనేలా 'ఆగడు'ని రూపొందిస్తున్నట్టు సినిమావర్గాలు చెబుతున్నాయి. మహేష్ శైలి వినోదం, యాక్షన్ అంశాల మేళవింపుతో సాగే ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 26న సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇంతకాలం శ్రీను వైట్లతో కలిసి పని చేసిన గోపీ మోహన్, కోన వెంకట్ సొంతగా దర్శకత్వం వైపు అడుగులు వేయడంతో.... 'ఆగడు' సినిమాకు సొంతగా స్క్రిప్టు రాసుకుని దిగారు శ్రీను వైట్ల. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో 'దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు చేసారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో 'ఆగడు' సినిమా చేయడానికి రెడీ కావడం గమనార్హం. ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల,నిర్మాతలు పూర్తి నమ్మకంగా ఉన్నారు. సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: కె.వి. గుహన్, కళ: ఎ.ఎస్.ప్రకాశ్, కూర్పు: ఎం.ఆర్.వర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పరుచూరి కోటి.


Click it and Unblock the Notifications











