‘ఆగడు’ సినిమాలో బూతు డైలాగులు, ఇదిగో లిస్ట్...
హైదరాబాద్: ఈ మధ్య తెలుగు సినిమాల్లో బూతు డైలాగులు, డబల్ మీనింగ్ డైలాగుల జోరు పెరిగి పోతోంది. చిన్న సినిమా అయినా...పెద్ద సినిమా అయినా...మహేష్ బాబు లాంటి టాప్ హీరో సినిమా అయినా....ఇలాంటి తప్పడం లేదు. అయితే సెన్సార్ బోర్డు ఇలాంటి వాటికి వీలైనంత కత్తెర వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ‘ఆగడు' సినిమాకు సంబంధించిన సెన్సార్ సర్టిఫికెట్ బయటకు వచ్చింది. అభ్యంతరకరంగా ఉన్న డైలాగులకు సెన్సార్ బోర్డు అడ్డు కట్ట వేసింది. వాటి ప్లేసులో కాస్త మర్యాదపూర్వకంగే డైలాగులను చేర్చారు. సెన్సార్ సర్టిఫికెట్ లోని వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
మూవీ నేమ్ : ఆగడు(వీడియో)
మూవీ లాంగ్వేజ్: తెలుగు
మూవీ కేటగిరీ : U/A(అన్ రిస్టిక్టెడ్ పబ్లిక్ ఎగ్జిబిషన్ -బట్ విత్ పేరెంటల్ గైడెన్స్)
సర్టిఫైడ్ బై రిజీనల్ ఆఫీస్: హైదరాబాద్
సర్టిఫికెట్ నెం : DIL/2/88/2014-HYD
సర్టిఫికెట్ డేట్: 16/09/2014
రన్ టైం : 165 నిమిషాల 22 సెకన్లు
నిర్మాతలు: ఆచంట రామబ్రహ్మం, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర, 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి

తొలగించబడిన డైలాగుల వివరాలు..
- డిక్కి బలిసిన కోడి...డైలాగు నుండి డిక్కి తొలగించి ‘మక్కి బలిసిన కోడి' అని పెట్టాలి.
- బద్దలవుతుంది అనే డైలాగును ‘పరుగు పెట్టిస్తాడు'గా మార్చాలి.
- బొక్క, పిచ్చి పకోడి, నీఅయ్య డైగులను కట్ చేయాలి
- మీడియాని రామ్ గోపాల్ వర్మ కొన్న రకంగా...అనే డైలాగు నుండి మీడియా పదం తొలగించి ‘పబ్లిసిటీని రామ్ గోపాల్ వర్మ కొన్న రకంగా' అని మార్చాలి.
- బోకు, నాయాల అనే పదాలను కట్ చేయాలి. బోకెదవ అనే డైలాగును ‘చెత్త వెదవ'గా మార్చాలి.
- దూల తీరింది అనే డైలాగును ‘బాగా అయింది'గా మార్చాలి.
- నా కొడకా, బొంగేంకాదు డైలాగులు కట్ చేయాలి. బొక్కలో డైలాగును ‘లోపల'గా మార్చాలి.
- లిక్కర్ బాలిల్స్ పై బ్రాండ్ నేమ్ బ్లర్ చేయాలి.
-యూనిఫాంలో ఉన్న పోలీసాఫీసర్‌ను సహాయకుడు కొట్టే సన్నివేశం బ్లర్ చేయాలి లేదా రెడ్యూస్ చేయాలి.
-పోసాని తన కాళ్లు చాచుకుని కూర్చునే సన్నివేశం తొలగించాలి.
-ఐటం సాంగులో బొడ్డుపై క్లోజప్ షాట్ సీన్ తొలగించాలి.
-తమన్నా సాంగులో.....‘జంక్షన్ లో నా ఫంక్షన' అనే లిరిక్ లో ‘నా' పదం తొలగించాలి. పంపుసెట్ రూంలో నా కర్ర బిల్ల ఆడి పడేద్దామా అనే లిరిక్ నుండి ‘నా' అనే పదం తొలగించాలి.


Click it and Unblock the Notifications











