నవంబర్ నుంచి మహేష్ బాబు ‘ఆగడు’
'దూకుడు' లాంటి హిట్ తర్వాత మహేష్ బాబు-శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో 'ఆగడు' పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్. ప్రస్తుతం 'ఆగడు' స్క్రిప్టు వర్కు దశలోనే ఉంది. ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి.
'ఆగడు' సినిమాను రూ. 40 కోట్ల బడ్జెట్ మించకుండా పూర్తి చేయాలని, అప్పుడే నిర్మాతలకు, బయ్యర్లకు మంచి జరుగుతుందని మహేష్ బాబు శ్రీను వైట్లు సూచించినట్లు తెలుస్తోంది. తన సినిమా నష్టాల పాలైతే తనకే చెడ్డపేరు కాబట్టి మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మహేష్ బాబు ఆలోచన పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న 1(నేనొక్కడినే) సినిమాతో పాటు'ఈ రెండు ప్రాజెక్ట్ లనూ 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ యే నిర్మిస్తుంది. ఈ సినిమాల నిర్మాతలైన రామ్ ఆచంట, గోపి ఆచంటమరియు అనీల్ సుంకర మహేష్ కు సన్నిహితులు. 1(నేనొక్కడినే) సినిమా 2014 సంక్రాంతికి విడుదలకానుంది.


Click it and Unblock the Notifications












