'ఆగడు' హిందీ వెర్షన్ ట్రైలర్ ఇదే...(వీడియో)

By Srikanya

హైదరాబాద్ : మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్ లో హై ఎక్సపెక్టేషన్స్ తో రూపొందిన చిత్రం ఆగడు. ఈ చిత్రం తెలుగులో పెద్దగా వర్కవుట్ కాలేదు. అయితే ఈ చిత్రం ఇప్పుడు హిందీలో ఎనకౌంటర్ శంకర్ టైటిల్ తో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం అక్కడ బాగా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు. నవంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఆ ట్రైలర్ ఇదే...

హిందీలో కూడా ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేసి, నార్త్ లో మహేష్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని క్యాష్ చేసుకుని, దాన్ని అడ్డం పెట్టి హిందీ శాటిలైట్ రైట్స్ అమ్మనున్నారని చెప్పుకుంటున్నారు. గతంలో భాక్సాఫిీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచిన 1,నేనొక్కిడినే చిత్రాన్ని ఏక్ క దమ్ టైటిల్ తో విడుదల చేసారు. అయితే దురదృష్టవశాత్తు ఆ చిత్రం నార్త్ ఆడియన్స్ కు కూడా నచ్చలేదు. పోకిరి, ఖలేజా, బిజినెస్ మ్యాన్ చిత్రాలు మాత్రం నార్త్ లో బాగానే ఆడాయి. దాంతో ఆగడు చిత్రంపై ఆశలు పెట్టుకున్నారని తెలుస్తోంది.

Aagadu Hindi Version Encounter Shankar Trailer!

ఇక ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే బిజినెస్‌ పూర్తయింది. శాటిలైట్‌ రూపంలో దాదాపు రూ.12 కోట్లు అందుకొన్నట్టు అంచనా. మహేశ్‌ జోడీగా తొలిసారి తమన్నా నటించటం, శ్రుతిహాసన్‌ ఓ పాటలో మహేశ్‌తో స్టెప్పులేయడం అదనపు ఆకర్షణలు. ఇవి నార్త్ వారిని ఆకట్టుకునే అవకాసం ఉందని అంటున్నారు.

డా.రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, నెపోలియన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: అనీల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, రచనా సహకారం: ప్రవీణ్ వర్మ, సంగీతం: ఎస్.ఎస్.థమన్, సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, ఆర్ట్: ఎఎస్ ప్రకాష్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, కో-డైరెక్టర్: చలసాని రామారావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కోటి పరుచూరి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీను వైట్ల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X