వీరాభిమానం: మహేష్ బాబు ఫ్యాన్ ఇక్కడ... (ఫోటో)
హైదరాబాద్: టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజిలో ఉందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఫ్యాన్స్ తమ హీరోపై అభిమానం రకరకాలుగా ప్రదర్శిస్తుంటారు. త్వరలో మహేష్ బాబు 'ఆగడు' చిత్రం విడుదలకు సిద్దమవుతున్న నేపథ్యంలో ఆ చిత్రం పేరును చేతిపై మెహందీగా పెట్టుకుని అభిమానం చాటాడు ఓ అభిమాని. సోషల్ మీడియాలో ఇపుడు ఈ ఫోటో హల్ చల్ చేస్తోంది.
ఆగడు సినిమా విషయానికొస్తే...ఇటీవలే ఈచిత్రం క్లైమాక్స్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం విదేశాల్లో పాటల చిత్రీకరణ కోసం రంగం సిద్దమవుతోంది. మహేష్‌బాబు, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రమిది. శ్రీనువైట్ల దర్శకుడు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు.

ప్రస్తుతం యూరఫ్‌లో పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఇంకా కొంత టాకీ పార్ట్, ప్యాచ్ వర్క్ మిగిలి ఉంది. సెప్టెంబర్ మొదటివారానికి గుమ్మిడికాయ కొట్టేయనున్నారు. అప్పటితో 'ఆగడు' షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. 'ఆగడు' సినిమా కోసం శ్రుతి హాసన్ ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడుతోంది. ''తమన్ అందించిన మాస్ మసాలా గీతమిది. ఇందులో మహేష్, శ్రుతిహాసన్ స్టెప్పులు ప్రేక్షకులకు కిక్ ఇస్తాయి'' అంటోంది చిత్రబృందం.
డా.రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, నెపోలియన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: అనీల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, రచనా సహకారం: ప్రవీణ్ వర్మ, సంగీతం: ఎస్.ఎస్.థమన్, సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, ఆర్ట్: ఎఎస్ ప్రకాష్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, కో-డైరెక్టర్: చలసాని రామారావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కోటి పరుచూరి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీను వైట్ల.


Click it and Unblock the Notifications











