మహేష్ బాబు సంతకం ఇదిగో(ఫొటో)
హైదరాబాద్ : మహేష్ బాబు సంతంకం కావాలనుకునే అభిమానులను ఆనందపరచటానికి పోస్ట్ కార్డ్ లపై దానిని ప్రింట్ చేసి ప్రమోషన్ మొదలెట్టారు ఆగడు నిర్మాతలు. సెప్టెంబర్ 19న విడుదల అవుతున్న ఈ చిత్రం కోసం చేస్తున్న ప్రమోషన్ కు ఏ మార్గమూ విడిచి పెట్టదలచుకోలేదు నిర్మాతలు. సూపర్ ఫ్యాన్స్ కు ఈ ప్రింట్ చేసిన ఈ పోస్ట్ కార్డులను ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా అందచేస్తున్నారు. వీటిని చూసి మహేష్ అభిమానులు మురిసిపోతున్నారు.
ఇదిలా ఉంటే... బెజవాడలోని అలంకార్ థియేటర్ వద్ద ఆదివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రిన్స్ మహేష్‌బాబు నటించిన ‘ఆగడు' సినిమా విడుదల సందర్భంగా 90 అడుగుల మహేష్‌బాబు కటౌట్‌ను అభిమానులు ఏర్పాటు చేశారు. అయితే భారీ కటౌట్‌కు అనుమతి లేదని, దానిని తొలగించేందుకు అధికారులు ప్రయత్నించారు.

అధికారుల ప్రయత్నాలను అభిమానులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. కటౌట్ ఏర్పాటును అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఓ అభిమాని కాల్వలో దూకాడు. తమ అభిమాన హీరో కటౌట్ ఏర్పాటు చేయాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. కాల్వలో దూకిన అభిమానిని స్థానికులు కాపాడారు.


Click it and Unblock the Notifications











