మహేష్ బాబు...‘మీలో ఎవరు సూపర్ స్టార్ సూపర్ ఫ్యాన్’
హైదరాబాద్: 'ఆగుడు' సినిమా ప్రమోషన్లో భాగంగా 'మీలో ఎవరు సూపర్ స్టార్ సూపర్ ఫ్యాన్' కాంటెస్టును నిర్మాతలు ఈ రోజు (ఆగస్టు 25) లాంచ్ చేసారు. ఇందులో భాగంగా స్పెషల్‌గా డిజైన్ చేసిన ఆగుడు వ్యాన్ ఈ రోజు నుండి వైజాగ్, విజయవాడ, ఖమ్మం, వరంగల్, తిరుపతి, కర్నూలు ఏరియాల్లో పర్యటిస్తుంది. మూడు రోజుల పాటు ఈ పర్యటన సాగుతుంది.
కాలేజీలు, షాపింగ్ మాల్స్, థియేటర్ల వద్ద ఈ వ్యాన్ ఆగుతుంది. యాంకర్స్ మహేష్ బాబు, అతని సినిమాల గురించిన ప్రశ్నలు అడుగుతారు. సరైన సమాధానాలు చెప్పిన వారు వ్యాన్‍లోని కంప్యూటర్లో గేమ్ ఆడే అవకాశం దక్కించుకుంటారు. మహేష్ బాబు, అతని సినిమాలకు సంబంధించిన వివరాలతో ఈ గేమ్ ఉంటుంది. ఇలా ప్రతి సెంటర్ నుండి కంప్యూటర్ గేమ్‌లో ఎక్కువ స్కోరు చేసిన వారిని షార్ట్ లిస్ట్ చేసి....ఆగస్టు 30న జరిగే ఆడియో వేడుకకు ఆహ్వానిస్తారు. అక్కడ జరిగే కాంటెస్టులో ఒక సూపర్ ఫ్యాన్‌ను ఎంపిక చేసి స్పెషల్ గిఫ్ట్ ఇస్తారు.

శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఆగడు చిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా నటిస్తోంది. శృతి హాసన్ ఐటం సాంగు చేయడం మరో ప్రత్యేకత. తమన్ సంగీతం అందించారు. 'దూకుడు' వంటి భారి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ బాబు, శ్రీను వైట్ల, తమన్ కాంబినేషన్లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాపై అభిమానులలో భారి అంచనాలున్నాయి.


Click it and Unblock the Notifications











