‘ఆగడు’ ఐటం సాంగ్ మేకింగ్ (వీడియో)
హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆగడు' చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ‘ఆగడు' సినిమాకు మిక్డ్స్ టాక్ వచ్చినప్పటికీ ఓపెనింగ్స్ మాత్రం భారీగానే వచ్చాయి. సినిమాకు మరింత ప్రచారం కల్పించి భారీ వసూళ్లు రాబట్టేందుకు నిర్మాతలు తమ శక్తి మేర ప్రయత్నిస్తున్నారు.
ఇందులో భాగంగా ఆగడు సినిమాలోని ఐటం సాంగ్ ‘జంక్షన్‌లో నా ఫంక్షన్' మేకింగ్ వీడియో యూట్యూబ్ ద్వారా విడుదల చేసారు. ఈ సాంగులో హీరోయిన్ శృతి హాసన్ హాట్ అండ్ సెక్సీగా హొయలు ఒలికించింది. మరి ఈ సాంగ్ చిత్రీకరణ ఎలా జరిపారనే విషయమై మీరూ ఓ లుక్కేయండి.

ఘట్టమనేని రమేష్ బాబు సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 19న గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈచిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్ గా నటించింది.
దూకుడు లాంటి భారీ విజయం తర్వాత మహేష్ బాబు-శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ముందను నుండీ అంచనాలు భారీగానే ఉన్నాయి. అంచనాలకు తగిన విధంగా ఈ చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకున్న ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2వేల థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసింది. అయితే సినిమా అంచనాలను అందుకునే విధంగా లేదనే టాక్ విడుదలైన తర్వాత వచ్చింది.


Click it and Unblock the Notifications











