twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు ‘ఆగడు’ న్యూ రిలీజ్ డేట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'ఆగడు' చిత్రం విడుదల తేదీ తొలుత సెప్టెంబర్ 26 అనుకున్నప్పటికీ.....ఇంకా ముందుగానే రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే పాఠకుల దృష్టికి తెచ్చాం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆగడు చిత్రాన్ని సెప్టెంబర్ 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

    శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. 'దూకుడు' తర్వాత మహేష్‌, శ్రీను వైట్ల కలయికలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల్ని అందుకొనేలా 'ఆగడు'ని రూపొందిస్తున్నట్టు సినిమావర్గాలు చెబుతున్నాయి.

    హైదరాబాద్

    మహేష్‌ శైలి వినోదం, యాక్షన్‌ అంశాల మేళవింపుతో సాగే ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

    కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల 'ఆగడు' టీజర్‌ని విడుదల చేశారు. ఇందులో మహేష్‌ పలికిన సంభాషణలు అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపాయి. ''సినిమాల ప్రభావం జనాలమీద ఎంతుందో తెలియదుగానీ, పంచ్‌ డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది..'' అంటూ పంచ్‌లపై ఓ పంచ్‌ వేశారు. ''ప్రతివోడూ పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుకలంటూ ఎదవ కంపేరిజన్‌లు, ఒళ్లు వులపరం వచ్చేస్తోంది..'' అంటూ ఇంకోటి. మొత్తానికి టీజర్‌ మొత్తం హుషారుగా సాగిపోయింది. సినిమాపై అంచనాలు పెంచింది.

    English summary
    Super Star Mahesh Babu’s Aagadu will hit the big-screens on September 19 worldwide, as per the latest reports.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X