ఒకటే పోలిక : గబ్బర్ సింగ్-ఆగడు వేర్వేరు అంటున్న నిర్మాతలు

By Bojja Kumar

హైదరాబాద్: ‘ఆగడు' చిత్రం ఫస్ట్ టీజర్ విడుదలైనప్పటి నుండి ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ వరుకు అన్నీ......గతంలో వచ్చిన పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్' చిత్రాన్ని గుర్తు చేస్తున్నాయనే వాదన తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆగడు సినిమా కూడా గబ్బర్‌సింగ్‌లా ఉంటుందేమో? అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి.

ఈ వార్తలపై స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు ‘ఆగడు' చిత్ర నిర్మాతలు. మీడియా సమావేశంలో పాల్గొన్న రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర మాట్లాడుతూ......ఆగడు, గబ్బర్ సింగ్ చిత్రాల్లో హీరోలిద్దరూ పోలీసాఫర్లే అనే పోలిక తప్ప ఇతర ఏ విషయంలోనూ పోలిక ఉండదని స్పష్టం చేసారు.

Aagadu Movie producers Press Meet

తాను అనుకున్న పని చేయడానికి ఎవరూ ఆపినా ఆగని సిన్సియర్ పోలీసాఫీసర్ కథే ‘ఆగడు' చిత్రం. మహేష్ బాబు పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. సినిమా మొత్తం మంచి వినోదాత్మకంగా ఉంటుంది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ పోలీసాఫీసర్ల పాత్రలు చయడం వల్లనే గబ్బర్ సింగ్ లా ఉందనే భావన తెరపైకి వచ్చి ఉంటుందని వ్యాఖ్యానించారు.

అదే విధంగా సినిమాలో మైనింగ్ మాఫియా గురించిన ప్రస్తావన కూడా ఉండదు. కొన్ని కీలక సన్నివేశాలు బళ్లారిలో చిత్రీకరించాం. అంతకు మించి ఏమీ లేదు. గతంతో శ్రీను వైట్ల-మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన ‘దూకుడు' చిత్రానికి ‘ఆగడు' చిత్రానికి టేకింగ్ విషయంలో చాలా తేడా ఉంటుందని, మహేష్ బాబు లుక్ అదిరిపోయేలా ఉంటుందని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X