మహేష్ ‘ఆగడు’...లీకు వీడియో హల్ చల్!
హైదరాబాద్: మహేష్ బాబు నటిస్తున్న 'ఆగడు' చిత్రానికి సంబంధించిన ఓ లీకు వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ఆగడు టైటిల్ సాంగ్ చిత్రీకరిస్తుండగా.....ఎవరో దీన్ని తమ సెల్ ఫోన్లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ వీడియో కేవలం 22 సెకన్లు మాత్రమే ఉంది. ఈ లీకు వీడియో వల్ల సినిమాకు ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం లేదు. ఈ లీక్ వీడియో సినిమాకు మరింత పబ్లిసిటీ పెంచుతుందని అంటున్నారు.
మహేష్ బాబు, తమన్నా హీరో హీరోయిన్లుగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 'ఆగడు' చిత్రం తెరకెక్కుతోంది. గతంలో శ్రీను వైట్ల, మహేష్ బాబు కలిసి 'దూకుడు' చిత్రానికి పని చేసిన సంగతి తెలిసిందే. 'ఆగడు' చిత్రం వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం. 'ఆగడు' చిత్రంలో మహేష్ బాబు పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ శంకర్‌గా మహేష్ బాబును చూడబోతున్నాం. దూకుడులో తెలంగాణ యాసలో అదరగొట్టిన మహేష్ బాబు ఇపుడు రాయలసీమ యాసలో డైలాగులు విసరనున్నాడు.
ప్రస్తుతం బళ్లారి ప్రాంతంలో షూటింగ్ జరుగుతోంది. చిత్రంలో ఎంతో కీలకమైన డస్ట్ సీన్ చిత్రీకరించారు. ఈ సీన్ చిత్రీకరణ ఎంతో చాలెంజింగ్‌గా తీసుకున్న శ్రీను వైట్ల సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసారట. సినిమా యూనిట్ మొత్తం బాగా సహకరించడం వల్లనే ఈ సీన్ ఇంత బాగా పూర్తయిందని అంటున్న శ్రీను వైట్ల మహేష్ బాబుతో పాటు, టీం మొత్తానికి ధన్యవాదాలు తెలిపారు.
రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, నెపోలియన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: అనిల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, రచనా సహకారం: ప్రవీణ్ వర్మ,సంగీతం: ఎస్.ఎస్.తమన్, ఛాయా గ్రహణం: కె.వి.గుహన్. ఆగడు మూవీ ఆడియోను సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/i3Ltnp0cC88?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications












