మహేష్ ‘ఆగడు’ పొజిషన్ ఏంటి?

By Bojja Kumar

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'ఆగడు' చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా షూటింగ్ ఏ పొజిషన్లో ఉందనే విషయం తెలుసుకోవాలనే ఉత్సాహం అభిమానులకు ఉండటం సహజమే. అందుకే ఆ విషయాలను మీ ముందుకు తెస్తున్నాం. ప్రస్తుతం ఈ చిత్రం క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. మహేష్ బాబు, విలన్ సోను సూద్ ఫైట్ సీన్లలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది.

క్లైమాక్స్ సీన్లు షూటింగ్ పూర్తయిన తర్వాత పాటల చిత్రీకరణ కోసం యూరఫ్ వెళ్లనున్నారు. నార్వే తో పాటు పలు ప్రాంతాల్లో పాటల చిత్రీకరణ జరుగనుంది. మరో వైపు పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. సంగీత దర్శకుడు థమన్ పాటలు రెడీ చేసాడు. పాటల కంపోజింగ్ పూర్తయిన విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Aagadu Music Composition Completed: SS Thaman

ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు 31న ఆడియో విడుదల చేసి...సెప్టెంబర్ 19 లేదా సెప్టెంబర్ 26వ తేదీన సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో పెంచింది. ఇక ట్రైలర్ అదిరిపోయే విధంగా ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్.

దూకుడు' తర్వాత మహేష్‌, శ్రీను వైట్ల కలయికలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల్ని అందుకొనేలా 'ఆగడు'ని రూపొందిస్తున్నట్టు సినిమావర్గాలు చెబుతున్నాయి. మహేష్‌ శైలి వినోదం, యాక్షన్‌ అంశాల మేళవింపుతో సాగే ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుందని నిర్మాతలు చెప్పారు. ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల, నిర్మాతలు పూర్తి నమ్మకంగా ఉన్నారు. ఈచిత్రంలో సోనూసూద్‌, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, నెపోలియన్‌, సాయికుమార్‌ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: కె.వి. గుహన్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌, కూర్పు: ఎం.ఆర్‌.వర్మ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X