ఆగడు ఎఫెక్ట్: కొరటాల శివపై ఒత్తిడి
హైదరాబాద్: ఆగడు సినిమా ఫలితంతో త్వరలో మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న దర్శకుడు కొరటాల శివపై ఒత్తిడి పెరిగిందని సినీ పరిశ్రమలో చర్చిసాగుతోంది. రొటీన్‌కి భిన్నంగా, కొత్తగా, ప్రేక్షకులు, అభిమానులు మెచ్చే విధంగా సినిమా తీయాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. మరి కొరటాల శివ అంచనాలను ఏ మేరకు అందుకుంటాడు? మహేష్ బాబు రేంజిని నిలబెట్టే సినిమా తీయడంలో ఆయన ఏమేరకు సక్సెస్ అవుతాడు అనేది హాట్ టాపిక్ అయింది.

ఈ చిత్రం ఈ ఆగస్టు 11న పద్మాలయ స్టూడియోలో గ్రాండ్‌గా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఇప్పటికే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ ఎంపికయింది. పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
సినిమాపై ఇటీవల రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారని, ఈచిత్రానికి 'కన్నయ్య' అనే టైటిల్ పెడుతున్నారనే వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై దర్శకుడు కొరటాల శివ స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదని...మహేష్ బాబు ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయడం లేదని, అదే విధంగా టైటిల్ కూడా ఖరారు కాలేదని స్పష్టం చేసారు. ఏ విషయమైనా తానే స్వయంగా వెల్లడిస్తానని కొరటాల శివ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











