యూరఫ్‌లో జెండా ఎత్తేసిన మహేష్ బాబు అంట్ టీం
హైదరాబాద్: 'ఆగడు' సినిమా షూటింగులో భాగంగా యూరఫ్ వెళ్లిన మహేష్ బాబు అండ్ మూవీ టీం ఈ రోజుతో అక్కడ షూటింగ్ పూర్తి చేసుకోనున్నారు. ఈ షూటింగుతో ఆగడు షూటింగ్ మొత్తం పూర్తయినట్లవుతుంది. రేపు యూనిట్ మొత్తం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.
ఆగస్టు 30వ తేదీన 'ఆగడు' ఆడియో గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఆగడు చిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా నటిస్తోంది. శృతి హాసన్ ఐటం సాంగు చేయడం మరో ప్రత్యేకత. తమన్ సంగీతం అందించారు. 'దూకుడు' వంటి భారి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ బాబు, శ్రీను వైట్ల, తమన్ కాంబినేషన్లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాపై అభిమానులలో భారి అంచనాలున్నాయి.

ఈ చిత్రానికి అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు. సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











