‘ఆగడు’ శాటిలైట్ రైట్స్: ‘అత్తారింటికి...’ రికార్డు బద్దలు

By Bojja Kumar

హైదరాబాద్: మహేష్ బాబు నటిస్తున్న 'ఆగడు' చిత్రం శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయాయి. తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం జెమినీ టీవీ వారు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ రూ. 9.75 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఇప్పటి వరకు ఇదే హయ్యెస్ట్. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది'(రూ. 9 కోట్లు) చిత్రం నెం.1 స్థానంలో ఉండేది. ఇపుడు ఆ రికార్డును 'ఆగడు' బద్దలు కొట్టింది.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'ఆగడు' చిత్రం టీజర్ ఇటీవల మే 31న కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని విడుదలైన సంగతి తెలిసిందే. 51 సెకండ్ల నిడివిగల ఈ వీడియో ఇంటర్నెట్లో దుమ్ము రేపుతోంది. నాలుగు రోజుల్లోనే 1 మిలియన్ హిట్స్ సొంతం చేసుకుంది.

Aagadu satellite rights Rs. 9.75 Cr

14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్. తమన్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 'దూకుడు' తర్వాత మహేష్‌, శ్రీను వైట్ల కలయికలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఫస్ట్ లుక్ ఉండటంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X