»   » మహేష్ బాబు క్షేమం, 10వ తేదీని నుండి రంగంలోకి...

మహేష్ బాబు క్షేమం, 10వ తేదీని నుండి రంగంలోకి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్లో 'దూకుడు' వంటి ఇండస్ట్రియల్ హిట్ ఇచ్చిన 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ అధినేతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న తాజా చిత్రం 'ఆగడు'. ఈ చిత్రానికి సంబంధించిన బళ్లారి షెడ్యూల్ పూర్తయింది. మార్చి 10 నుండి హైదరాబాద్‌లో తాజా షెడ్యూల్ ప్రారంభం కానుంది.

ఈ సందర్భంగా నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర మాట్లాడుతూ 'ఆగడు బళ్ళారి షెడ్యూల్ పూర్తయింది. ఈ షెడ్యూల్‌లో 1 పాట, కొన్ని ముఖ్య సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. మార్చి 10 నుండి హైదరాబాద్‌లో తాజా షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. కెరీర్లో 50వ చిత్రం చేస్తున్న థమన్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇస్తున్నారని' తెలిపారు.

మహేష్ బాబు తొలిసారి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో 40 మంది ప్రముఖ తారాగణం ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: అనీల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, రచనా సహకారం: ప్రవీన్ వర్మ, సంగీతం: ఎస్.ఎస్.థమన్, సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, కో డైరెక్టర్: చలసాని రామారావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోటి పరుచూరి, నిర్మాతలు: రామ్ చరణ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సంకర, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీను వైట్ల.

మహేష్ బాబు క్షేమమే..
మహేష్ బాబు ఇటీవల బళ్లారి షూటింగులో గాయపడ్డట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమాకు సంబంధించిన పాట చిత్రీకరిస్తుండగా ఆయన కాలి కండరాలకు గాయమైనట్లు ప్రచారం జరిగింది. అయితే యూనిట్ సభ్యులు మాత్రం మహేష్ బాబు క్షేమంగానే ఉన్నారని, మే 10 నుండి హైదరాబాద్‌లో జరిగే షూటింగులో పాల్గొంటారని అంటున్నారు.

English summary
Mahesh Babu's Aagadu new schedule will kick start from 10th of March in Hyderabad, where some crucial scenes will be canned. Anil Sunkara, Ram Achanta and Gopichand Achanta are jointly producing this movie under 14 Reels Entertainment banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu