మహేష్ 'ఆగడు' రెగ్యులర్ షూట్ ఎప్పటినుంచంటే...
ప్రస్తుతం మహేష్ దృష్టి మొత్తం సుకుమార్ తో చేస్తున్న చిత్రంపై ఉంది. ఈ చిత్రం కోసం జూన్ లో ఇంగ్లాండ్ వెళతారు. అక్కడ మేజర్ యాక్షన్ సీక్వెన్స్ పూర్తి చేసుకుని వస్తారు. తర్వాత శ్రీను వైట్ల సినిమా మొదలవుతుంది. అయితే ఇంకా ఈ చిత్రానికి హీరోయిన్ ఫైనల్ కాలేదు.
ఇక శ్రీను వైట్ల ఈ చిత్రాన్ని మరింత ఎంటర్టైన్మెంట్ గా మలచాలనుకుంటున్నారు. దూకుడుని దాటేలా సీన్స్ రెడీ చేస్తున్నాడని వినికిడి. ఆయనతో కంటిన్యూగా పనిచేసే కోన వెంకట్ లేకపోవటంతో కాస్త టైమ్ పట్టవచ్చేమో కానీ మంచి అవుట్ పుట్ తో వస్తాడంటున్నారు.
14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో 'దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో సినిమాకు అగ్రిమెంట్ కుదుర్చుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఆ సంస్థ పని తీరు నచ్చడం వల్లనే మహేష్ బాబు వరుసగా ఆ సంస్థ కోసం డేట్స్ ఇస్తున్నారని, పైగా అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటలు మహేష్‌కు బాగా సన్నిహితులు అవ్వడం కూడా మరోకారణం అంటున్నారు.


Click it and Unblock the Notifications












