‘ఆగడు’అక్కడ అదరకొడ్తోంది
హైదరాబాద్ : మహేశ్ హీరోగా నటిస్తున్న 'ఆగడు' రెండో టీజర్‌ను ఆయన పుట్టినరోజు సందర్భంగా శనివారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ ఇప్పుడు యూ ట్యూబ్ లో వైరల్ లా దూసుకుపోతోంది. ఇప్పటికే 6.5 లక్షలు వ్యూలు దాటి రికార్డులు క్రియేట్ చేస్తోంది. మహేష్ అభిమానులు సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ద్వారా ఈ ట్రైలర్ ని షేర్ చేస్తున్నారు. ఈ టీజర్ అద్బుతంగా పేలిందని, మహేష్ చెప్పిన డైలాగులు అదిరాయని, సినిమా కోసం వెయిటింగ్ అని అంటున్నారు.
మహేశ్ చెప్పిన 'డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకొచ్చి తొడకొట్టిందంట', 'అయినా నువ్వు డైలాగ్ వేస్తే కౌంటర్ వెయ్యడానికి నేను రైటర్‌ని కాదు ఫైటర్‌ని, అయ్యబాబోయ్ నాకు సినిమా డైలాగులు వొచ్చేస్తన్నాయేంటి' డైలాగులకు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది.
తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకుడు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. కృష్ణ పుట్టినరోజున విడుదల చేసిన ఈ సినిమా మొదటి టీజర్ తరహాలోనే ఈ రెండో టీజర్‌లో హైవోల్టేజి యాక్షన్ సీన్లు, పంచ్ డైలాగులు ఉన్నాయి.

ఈ కొత్త టీజర్‌తో 'ఆగడు' సినిమా ఎలా ఉండబోతోందో డైరెక్టర్ శ్రీను వైట్ల ఒక 'ఫీలర్' వదిలారని వారంటున్నారు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా మహేశ్ నటిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
'దూకుడు' తర్వాత మహేష్, శ్రీను వైట్ల కలయికలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల్ని అందుకొనేలా 'ఆగడు'ని రూపొందిస్తున్నట్టు సినిమావర్గాలు చెబుతున్నాయి. మహేష్ శైలి వినోదం, యాక్షన్ అంశాల మేళవింపుతో సాగే ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
డా.రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, నెపోలియన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: అనీల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, రచనా సహకారం: ప్రవీణ్ వర్మ, సంగీతం: ఎస్.ఎస్.థమన్, సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, ఆర్ట్: ఎఎస్ ప్రకాష్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, కో-డైరెక్టర్: చలసాని రామారావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కోటి పరుచూరి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీను వైట్ల.


Click it and Unblock the Notifications











