మహేష్ పంచ్ డైలాగ్స్...పవన్ కళ్యాణ్‌పై సెటైర్లు!(ఫోటోస్)
హైదరాబాద్: ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహేష్ బాబు 'ఆగడు' చిత్రం ట్రైలర్, ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్ ట్రైలర్లో మహేష్ బాబు చెప్పిన డైలాగ్స్ కేక పుట్టిస్తున్నాయి. అయితే మహేష్ బాబు చెప్పిన కొన్ని డైలాగ్స్ పవన్ కళ్యాణ్‌పై సెటైర్లలా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.
ఆ మధ్య వచ్చిన 'అత్తారింటికి దారేది' చిత్రంలో పవన్ కళ్యాణ్ 'నేను సింహం లాంటోడిని...అది గడ్డం గీసుకోదు...నేను గడ్డం గీసుకుంటాను...మిగతాదంతా సేమ్ టు సేమ్' అనే డైలాగ్ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా 'ఆగడు' చిత్రంలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ 'ప్రతి వోడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కంపేరిజన్స్.....' అంటూ ఉంది. సో ఇది కావాలని పవన్ కళ్యాణ్‌పై సెటైరిక్‌గా ప్లాన్ చేసారని, ట్రైలర్ రిలీజ్ హాట్ టాపిక్ కావాలని, ఈ విషయం మీడియాలో చర్చీనీయాంశం కావాలనే ఇలా చేసినట్లు స్పష్టమవుతోంది.
ట్రైలర్లో మహేష్ బాబు చెప్పిన డైలుగులు ఇవే...
'సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలీదు కానీ...పంచ్ డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది'
'ప్రతి వోడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కంపేరిజన్స్.....ఎలపరం వచ్చేస్తోంది'
'ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు వాట్ టు డు వాట్ నాట్ టు డూ'

మహేష్ బాబు
ఈ చిత్రంలో మహేష్ బాబు పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. గతంలో మహేష్ బాబుతో ‘దూకుడు' లాంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీను వైట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

తమన్నా
14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్. తమన్ సంగీతం అందిస్తున్నారు.

యాక్షన్ ఎంటర్టెనర్
యాక్షన్ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 'దూకుడు' తర్వాత మహేష్, శ్రీను వైట్ల కలయికలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఫస్ట్ లుక్ ఉండటంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వరుసగా అదే సంస్థలో...
14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో ‘దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో ‘1-నేనొక్కడినే' సినిమాకు చేసారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో ‘ఆగడు' సినిమా చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











