ప్రపంచ వ్యాప్తంగా ‘ఆగడు’ 100 కోట్లు ఖాయం!
హైదరాబాద్: మహేష్ బాబు ‘ఆగడు'చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లు వసూలు చేసుంది అంటున్నారు మహేష్ బాబు ఫాదర్ సూపర్ స్టార్ కృష్ణ. ఈ చిత్రాన్ని ఆయన తన సతీమణి విజయనిర్మలతో కలిసి శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని సినీ మాక్స్ థియేటర్లో ప్రత్యేకంగా వీక్షించారు.
అనంతరం మీడియాతో కృష్ణ మాట్లాడుతూ...‘ఆగడు' సినిమా అదిరింది. సినిమా చూస్తున్నంత సేపు చాలా చాలా బాగుంది. మహేష్ ఎక్స్ ట్రార్డినరీ నటించాడు. శ్రీను వైట్ల అద్భుతంగా డైరెక్ట్ చేసాడు. థమన్ మ్యూజిక్, ఫోటోగ్రఫీ, ఫైట్స్, కామెడీ ఎస్పషల్లీ డైలాగ్స్ అన్నీ ఎక్సలెంటుగా ఉన్నాయి. ఇందులో ఇది బాగాలేదు అని చెప్పడానికి ఏమీ లేదు' అన్నారు.

14 రీల్స్ నిర్మాతలు రామ్, గోపీ, అనిల్ చాలా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఆగడు' చిత్రం అన్ని రికార్డ్స్ క్రాస్ చేసి ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్లు కలెక్ట్ చేస్తుందని నా నమ్మకం. మంచి సబ్జెక్టు కుదిరితే నేను, మహేస్ కలిసి నటిస్తామని ఆయన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
విజయనిర్మాల మాట్లాడుతూ...‘టైటిల్ కి తగిన విధంగానే సినిమా వండర్ ఫుల్ గా ఉంది. ఒక్క సెకను కూడా బోర్ కొట్టకుండా సినిమా ఇంత త్వరగా అయిపోయిందా అనిపించింది. మహేష్ పుట్టకతోనే మంచి ఆర్టిస్ట్. తనలో మంచి టాలెంట్ ఉంది. ఈ చిత్రంలో చాలా అద్భుతంగా నటించాడు. సైలెంటుగా ఉంటూనే అందర్నీ నవ్విస్తాడు. ఇది అందరికీ నచ్చే సినిమా అన్నారు.


Click it and Unblock the Notifications











