ప్రపంచంలోనే అతిపెద్ద పోలీస్ బెల్ట్...‘ఆగడు’ బెల్ట్ (ఫోటోస్)
హైదరాబాద్: మహేష్ బాబు నటించిన ‘ఆగడు' సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్ర నిర్మాతలు విశాఖ తీరంలో ప్రపంచంలోనే అతిపెద్ద పోలీస్ బెల్టును ఆవిష్కరించారు. దీని పొడవు 12వేల అడుగులు. పోలీసు డ్రెస్ లో బెల్ట్ కీలకమైనది కాబట్టి, ప్రపంచంలోనే అత్యంత పొడవైన పోలీస్ బెల్ట్ తయారు చేయించామని, ఈ బెల్ట్ పొడవు సుమారు 12వేల అడుగులు ఉంటుందని, వైజాగ్ ఆర్కే బీచ్ లో ఈ బెల్ట్ చూడొచ్చని నిర్మాతలు తెలిపారు.
ఆగడు సినిమా వివరాల్లోకి వెళితే...
ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. అంటే పెద్దలతో పాటు పిల్లలు కూడా వెళ్లి ఈ సినిమా నిరభ్యరంతంగా చూడొచ్చని అర్థం. ‘ఆగుడు' సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది నిర్మాతలు సినిమా ప్రమోషన్స్ ముమ్మరం చేసారు.
స్లైడ్ షోలో ఆగడు బెల్ట్ ఫోటోలు....

బెల్టు వద్ద అభిమానులు
విశాఖ ఆర్కే బీచ్ తీరంలో ఏర్పాటు చేసిన ఆగడు బెల్ట్ వద్ద అభిమానుల సందడి.

ప్రపంచంలోనే అతి పెద్దది
ఈ బెల్ట్ ప్రపంచలోనే అతి పెద్ద పోలీస్ బెల్ట్, పొడవు 12 వేల అడుగులు.

భారీ బిజినెస్
‘ఆగడు' చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ దాదాపు 55 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే సినిమా విడుదల ముందే భారీగా బిజినెస్ జరిగింది. శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇలా అన్నీ కలిపి ఇప్పటికే రూ. 75 కోట్ల వరకు నిర్మాతలకు ముట్టాయని అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2000 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేస్తోంది ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ.

ఆగడు
ఈచిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్. 'దూకుడు' వంటి భారి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ బాబు, శ్రీను వైట్ల, తమన్ కాంబినేషన్లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఇది. అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు.


Click it and Unblock the Notifications











