నాని 'ఆహా కల్యాణం' ఆడియో విడుదల తేదీ

By Srikanya

హైదరాబాద్ : బాలీవుడ్ సినిమా 'బ్యాండ్ బాజా బారాత్'కు అధికారిక రీమేక్ అయిన 'ఆహా కల్యాణం'లో నాని హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది తమిళ, తెలుగు భాషల్లో తయారవుతోంది. గోకుల్‌కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వాణీ కపూర్ హీరోయిన్.ఈనెల 23న ఈ చిత్రంలోని గీతాల్ని విడుదల చేస్తారు. ఒకప్పటి అందాల తార సిమ్రాన్‌ కీలక పాత్రధారిగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఆమె కథను మలుపు తిప్పే పాత్రలో కనిపించనుంది.

నాని మాట్లాడుతూ.... పెళ్లంటే.. ఎన్ని పనులో. శుభలేఖల దగ్గర్నుంచి ఇంకా ఎన్నెన్ని విషయాలు చక్కబెట్టాలో.. అందుకే అన్నారు 'పెళ్లి చేసి చూడు' అని. కానీ ఓ జంట మాత్రం పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేయించేస్తోంది. అదీ అల్లాటప్పాగా కాదు.. 'ఆహా కల్యాణం' అనిపించేలా. అదెలాగో మా సినిమా చూస్తే తెలుస్తుంది అంటున్నారు నాని.

'Aaha Kalyanam' audio on Jan 23

అలాగే..."యశ్‌రాజ్ ఫిలిమ్స్ (వై.ఆర్.ఎఫ్.) తొలి సౌత్ ఇండియన్ మూవీలో హీరోనైనందుకు గర్వంగా ఉంది. ముంబైలో వారి స్టూడియోని సందర్శించడం మరచిపోలేని అనుభూతి. అది పెద్ద ఎగ్జిబిషన్‌ను చూసినట్లే అనిపించింది. వై.ఆర్.ఎఫ్. అధినేత ఆదిత్య చోప్రాతో మూడు గంటల సేపు మాట్లాడే అవకాశం లభించింది. మా సినిమాకి సంబంధించిన ప్రతి చిన్న విషయం గురించి ఆయన మాట్లాడుతుంటే ఆ సంస్థ ఎందుకు ఆ స్థాయికి ఎదిగిందన్నది అర్థమైంది.ఇప్పటికే ఫ్రీమేక్‌గా రూపొందిన తెలుగు సినిమా ('జబర్‌దస్త్')ని నేను చూడలేదు. " అని నాని అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ''బాలీవుడ్‌ చిత్రం 'బ్యాండ్‌ బాజా బారాత్‌'కి ఇది రీమేక్‌. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నాం. ధరణ్‌ కుమార్‌ అందించిన బాణీలు ఆకట్టుకొంటాయి''అన్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న విడుదల చేయటానికి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒరిజినల్‌ను నిర్మించిన ప్రతిష్ఠాత్మక బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న తొలి దక్షిణాది చిత్రమిది. ఈ చిత్రం ఫస్ట్ లుక్, ట్రైలర్ ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X