నాని ‘ఆహా కళ్యాణం’ సెన్సార్ రిపోర్ట్

'ఆహా కళ్యాణం' చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈచిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసారు. ఈ నెల 21న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. తమిళ,తెలుగు భాషల్లో ఏక కాలంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ధరణ్ కుమార్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.
ఇటీవల జరిగిన ఆడియో వేడుకలో నాని మాట్లాడుతూ...ఆహా కళ్యాణం సినిమాలో ఓ సాహసం చేసాను. అదేమిటో సినిమా చూస్తే మీకే అర్థం అవుతుందని హీరో నాని చెప్పుకొచ్చారు. నాకు ఎటువంటి బ్యాగ్రౌండ్ లేక పోయినా పైకొచ్చానని అంతా అంటున్నారు. మీడియా, ప్రేక్షకులకు మించిన బ్యాగ్రౌండ్ ఇంకేం ఉంటుంది....అని నాని చెప్పుకొచ్చారు.
దర్శకుడు గోకుల్ కృష్ణ ఈచిత్రాన్ని రీమేక్ అయినప్పటికీ మన నేటివిటీకి తగినట్లుగా తెరకెక్కించారు. నేను పైసా, జెండాపై కపిరాజు సినిమాల్లో మాస్ రోల్స్ చేసాను. వాటి మధ్యలో ఈ సినిమా చేసాను. డిఫరెంటుగా ఉంటుందని నాని అన్నారు. ఈ సినిమాకు కెమెరాః లోకనాధన్ శ్రీనివాసన్, సంగీతం:ధరణ్ కుమార్, డైలాగ్స్: శశాంక్ వెన్నెలకంటి, సాహిత్యం: కృష్ణచైతన్య, రాఖేందు మౌళి, క్రియేటివ్ ప్రొడ్యూసర్: విజయ్ అమృతరాజ్, నిర్మాతః ఆదిత్య చోప్రా,స్ర్కీన్ ప్లే, హబీబ్ ఫైజల్: దర్శకత్వం: గోకుల్ కృష్ణ.


Click it and Unblock the Notifications











