ప్రేమ..పెళ్లి..ఫన్ ( 'ఆహా కళ్యాణం' ప్రివ్యూ)

By Srikanya

హైదరాబాద్ : పిల్ల జమీందార్, ఈగ,పైసా వంటి చిత్రాలతో తానేంటో ప్రూవ్ చేసుకున్న నాని కొత్త సినిమా వస్తోందంటే అందరిలోనూ ఆసక్తే. అందులోనూ ఓ రీమేక్ లో నటించాడంటే అందులో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుందని భావిస్తారు. బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన 'బ్యాండ్ బాజా బారాత్' తెలుగు,తమిళ భాషల్లో 'ఆహా కళ్యాణం' టైటిల్ తో రీమేక్ చేసారు. ఆ చిత్రం ఈ రోజు విడుదల అవుతోంది.

సరదాగా జీవితాన్ని ఎంజాయ్ చేసే శక్తి(నాని), వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ లో ఎదగాలనుకునే శృతి(వాణికపూర్) ల కథ ఇది. అనుకోకుండా జరిగిన పరిచయం శక్తిని ఆమె బిజినెస్ లోకి లాగేలా చేస్తుంది. ఇద్దరూ కలిసి ఓ పెళ్లిని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తారు. ఈ క్రమంలో ఆమె అతనితో ప్రేమలో పడ్డాడని అర్దం చేసుకుంటుంది. అయితే అతనికి రిలేషన్ షిప్స్ లో ఇరుక్కోవటం ఇష్టం ఉండదు. అక్కడ నుంచివీరిద్దరివి వేరే దారులు అవుతాయి. చివరకు వీరిద్దరూ ఒకటి ఎలా అయ్యారు అనేది మిగతా కథ.

దర్శకుడు ఎ.గోకుల్ కృష్ణ మాట్లాడుతూ ...ఇంత పెద్ద బేనర్ లో నా మొదటి సినిమా చేయడం ఆనందంగా ఉంది. నాని, వాణీ కపూర్ అందరూ నాకు చాలా సపోర్టు చేశారు. సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది అన్నారు

నాని మాట్లాడుతూ... "ఆహా కళ్యాణం తొలి కాపీ చూసిన తర్వాత చాలా నమ్మకంగా ఉన్నాను. మంచి పెళ్లికి వెళ్లొచ్చినట్టు ఉంటుంది. ఈ సినిమా ఉత్తరాదికన్నా మనకే ఎక్కువగా నప్పుతుంది. మూలంలోని ఆత్మను తీసుకుని అదే కెమిస్ట్రీని మేం కూడా తెరపై పండించాం. కొన్ని కీలక సన్నివేశాలు, పాటలు మినహా మిగిలిన సినిమానంతా ముందు తమిళంలో తెరకెక్కించి, తెలుగులోకి అనువదించాం. సిమ్రన్ సీనియర్ వెడ్డింగ్ ప్లానర్‌గా నటించారు. పాటలకు మంచి స్పందన వచ్చింది. ఇందులోవాణి కపూర్‌తో ముద్దు సీను ఉంది. దీనికి ముందే ఇంట్లో పర్మిషన్ తీసుకున్నారు. ముద్దు సీన్ చాలా సౌందర్యాత్మకంగా కనిపిస్తుంది. ఎక్కడా ఎబ్బెట్టుగా అనిపించదు'' అని అన్నారు.

వాణి కపూర్ మాట్లాడుతూ... ''పెళ్ళిళ్ల సీజన్‌ ఎప్పుడొస్తుందో నాకు అంతగా తెలియదు. అయితే ఈ నెల 21 నుంచి మాత్రం మనకు ఆ సీజన్‌ మొదలవుతుందని చెబుతాను. మా సినిమాలో తొలి సన్నివేశం నుంచి చివరి వరకూ పెళ్లి బాజాలే మోగుతుంటాయి. ప్రేక్షకులకు అప్పుడప్పుడే కల్యాణ మండపం వెళ్లొచ్చిన అనుభూతి కలుగుతుంది'' అన్నారు.

బ్యానర్: యశ్‌రాజ్‌ సంస్థ
చిత్రం:ఆహా కళ్యాణం
నటీనటులు: నాని,వాణీకపూర్‌,సిమ్రాన్ తదితరులు
కెమెరాః లోకనాధన్ శ్రీనివాసన్,
సంగీతం:ధరణ్ కుమార్,
డైలాగ్స్: శశాంక్ వెన్నెలకంటి,
కథ:మనీష్ శర్మ,
ఎడిటింగ్:భవన్‌కుమార్
సాహిత్యం: కృష్ణచైతన్య, రాఖేందు మౌళి
స్ర్కీన్ ప్లే: హబీబ్ ఫైజల్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: విజయ్ అమృతరాజ్,
నిర్మాతః ఆదిత్య చోప్రా,
దర్శకత్వం: గోకుల్ కృష్ణ.
విడుదల తేదీ: 21,ఫిభ్రవరి 2014

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X