ఆకలి పోరాటం ఆడియో రిలీజ్ విశేషాలు
Recommended Video

గంగాధర్, రేణుక, హరీష్ వినయ్, హారిక హీరో, హీరోయిన్ లుగా రామ్ సాయి గోకులం క్రియేషన్స్ వారు ఆనంద్ సాగర్ దర్శకత్వం లో పి.వి రాఘవులు నిర్మించిన చిత్రం ఆకలి పోరాటం.
ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శక నిర్మాతలతో పాటు సినిమా యూనిట్ కుడా హాజరయ్యారు, ముఖ్య అతిధిగా తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్ రామకృష్ణ గౌడ్ హాజరయ్యారు.
ఈ సందర్బంగా రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ... కొత్త సినిమాలు, చిన్న సినిమాలు రావాలి. ఇలా కొత్త సినిమాలు నిర్మించే వాళ్ళకి మేము ఎప్పుడు మా సహాయాన్ని అందిస్తాం. సినిమా పేరు ఆకలి పోరాటం చాలా బాగుంది. ఈ సినిమా నేటి సమాజం కోసం నిర్మించినట్టు ఉంది. చిన్న సినిమాలు చేసిన తర్వాత విడుదల కోసం థియేటర్స్ దొరకట్లేదు అని ఇబ్బందులు పడకండి. ఈ సినిమా విడుదల కోసం అన్ని విధాలుగా మేం సహాయం చేస్తామని దర్శక,నిర్మాతలకు మాటిచ్చారు.
నటీనటులు :
గంగాధర్
రేణుక
హరీష్ వినయ్
హారిక
తదితరులు
సాంకేతికవర్గం :
నిర్మాత : పలివెల వీర రాఘవులు
దర్శకత్వం : ఆనంద్ సాగర్


Click it and Unblock the Notifications











