బిజినెస్ లో దిగిన మరో తెలుగు హీరోయిన్.. చీఫ్ గెస్ట్లు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోక మానరు

సినీ నటులు నాలుగు రాళ్ళు వెనకేసుకున్నాక బిజినెస్ లు మొదలు పెట్టడం సర్వ సాధారనం. ఎక్కువగా హీరోలు ఇలా బిజినెస్ లలో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అయితే తాజాగా టాలీవుడ్ హీరోయిన్ ఆకాంక్ష సింగ్ కూడా బిజినెస్ లోకి దిగారు. ఆమె తన స్వస్థలమైన జైపూర్‌లో ఒక కేఫ్‌ను ప్రారంభించడం ద్వారా బిజినెస్ ఉమెన్ గా మారింది. ఆ కేఫ్ కి అటారియా అనే పేరు పెట్టారు. ఈ విషయం మీద ఆకాంక్ష మాట్లాడుతూ ఇది ఒక అందమైన ప్రదేశం అని, చివరకు నా దీర్ఘకాల కోరికను నెరవేర్చగలిగినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. నేను ఎప్పుడూ ఒక కేఫ్ తెరవాలని అనుకునే దానిని అని నా బావ అభిషేక్ ఇటీవల ఈ కేఫ్ ప్రారంభించాలని అనుకున్నప్పుడు వెంటనే పెట్టుబడి పెట్టడానికి సిద్ధం అయ్యానని చెప్పుకొచ్చారు.

మేము ఈ స్థలాన్ని అందంగా తయారు చేసామన్న ఆమె ఈ ప్లేస్ లో చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయని వెల్లడించింది. ఇది పగటిపూట మాత్రమే కాక రాత్రి సమయంలో కూడా గడపడానికి గొప్ప ప్రదేశం, "అని ఆకాంక్ష చెప్పారు. జైపూర్‌లో జూలై 15న నగరానికి చెందిన ఎన్‌జిఓకు చెందిన కొద్దిమంది పిల్లల సమక్షంలో ఈ కేఫ్‌ను ప్రారంభించారు. పిల్లలను ప్రత్యేక అతిథులుగా ఎందుకు పిలవాలని నిర్ణయించుకున్నారో వివరిస్తూ, ఆకాంక్ష ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Aakanksha Singh opens a cafe in Jaipur and invites NGO kids as special guests

"పిల్లల ముఖాల్లో ఇటువంటి శక్తివంతమైన చిరునవ్వులను చూడటం కంటే ఏమి బాగుంటుంది? మేము వారితో గొప్ప సమయం గడిపాము మరియు వారు రిబ్బను కత్తిరించినప్పుడు మాకు గొప్పగా అనిపించిందని అన్నారు. మేము వారితో కలిసి మ్యూజికల్ చైర్స్ ఆడాము, నృత్యం చేశామని అన్నారు. నూడుల్స్, పిజ్జాలు మరియు ఐస్ క్రీమ్‌ల వంటి పిల్లలు హ్యాపీగా ఫీల్ అయ్యే ఒక ప్రత్యేక మెనూని ఏర్పాటు చేసామని అన్నారు. వారు కూడా హీలియం బెలూన్లను వదిలి ఆనందించారు మరియు అవి ఆకాశం వైపు ఎగురుతున్నట్లు చూసి ఆనందించారు అని పేర్కొన్నారు. తెలుగులో మళ్ళీ రావా, దేవదాస్ సినిమాలతో పలకరించిన ఆ భామ హిందీలో మేడే అనే సినిమాలో నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X