twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కించపరచటానికి కాదు..రాధ్దాంతం వద్దు' (ఆంధ్రాపోరి ఆడియో సభలో..)

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఎవరినీ కించపరచడానికి, వివాదాలు రేకెత్తించడానికి ఆంధ్రాపోరి టైటిల్ పెట్టలేదు. ఓ తెలంగాణ అబ్బాయి తనను అమితంగా ప్రేమించిన, తాను అమితంగా ప్రేమించిన ఆంధ్రా అమ్మాయిని ముద్దుగా పిలుచుకునే పేరు. అనవసరంగా రాద్ధాంతం చేయొద్దు. కలెక్షన్స్ కోసం ప్రసాద్ ప్రొడక్షన్స్ కి ఇలా చేయవలసిన అవసరం లేదు అని దర్శకుడు రాజ్ ముదిరాజ్ అన్నారు.

    స్వర్గీయ ఎల్వీ ప్రసాద్ అశీసులతో ప్రసాద్ ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై రమేష్ ప్రసాద్ నిర్మించిన చిత్రం 'ఆంధ్రాపోరి'. రాజ్ ముదిరాజ్ దర్శకుడు. ఆకాష్ పూరి, ఉల్కా గుప్తా జంటగా నటించారు. జోస్యభట్ల సంగీత దర్శకుడు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం రాత్రి శిల్పారామం రాక్ హైట్స్ లో జరిగింది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఈ కార్యక్రమంలో 'మా' అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, విజయేంద్ర ప్రసాద్, రామజోగయ్య శాస్త్రి, వంశీ, కృష్ణ మదినేని, రమేష్ ప్రసాద్, బివిఎస్ రవి, చక్రవర్తి, సుధాకర్, రాహుల్, నందు, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, కిట్టు విస్సప్రగడ, అభిజిత్, శ్రిముఖి, ఆకాష్ పూరి, ఉల్కా గుప్తా, చైతన్య కృష్ణ తదిఅరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతరులు సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

    స్లైడ్ షో లో... ఆంధ్రాపోరి ఆడియో విడుదల ఫొటోలు

    ఆడియో ఆవిష్కరణ

    ఆడియో ఆవిష్కరణ

    ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఆడియో సిడిలను ఆవిష్కరించారు.

    తొలి సీడి ఆవిష్క

    తొలి సీడి ఆవిష్క

    తొలి సిడిని ప్రకాష్ రాజ్ స్వీకరించారు.

    ట్రైలర్ ఆవిష్కరణ

    ట్రైలర్ ఆవిష్కరణ

    ధియేట్రికల్ ట్రైలర్ ను ప్రకాష్ రాజ్ విడుదల చేశారు.

    నిర్మాత రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ...

    నిర్మాత రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ...

    మా తండ్రిగారు ఆఖరి శ్వాస వరకు సినిమాలు చేశారు. 60 సినిమాలకు దర్శకత్వం వహించారు. సినిమాలకు ఎంతో సేవ చేశారు. నేను టెక్నికల్ విభాగంలో సపోర్ట్ చేశాను. ఐమాక్స్ నా క్రియేషన్. ఆ థియేటర్లో ఎన్నో ప్రపంచ రికార్డులు సృష్టించాం. ప్రసాద్ లాబ్స్ 18సార్లు జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఇది మా బ్యానర్లో వస్తున్న 30వ సినిమా.

    నిర్మాత రమేష్ ప్రసాద్ కంటిన్యూ చేస్తూ...

    నిర్మాత రమేష్ ప్రసాద్ కంటిన్యూ చేస్తూ...

    రాజ్ మాదిరాజు కోసం ఈ సినిమా చేశాను. టీం అందరిని అతనే సెలెక్ట్ చేసుకున్నాడు. సిన్సియర్, హార్డ్ వర్కింగ్, కమిటెడ్ పర్సన్. చాలా సంతృప్తిని ఇచ్చిన సినిమా. సినిమా నిర్మాణాన్ని కంటిన్యూ చేస్తాను. మంచి కథల కోసం అన్వేషిస్తున్నాను. ఆఖరి శ్వాస వరకు సినిమాలు చేయాలనేది నా కోరిక అని అన్నారు. ఆకాష్, ఉల్కా గుప్తా బాగా నటించారు అని అన్నారు.

    రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ....

    రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ....

    టైటిల్ వింటేనే చాలా సరదాగా ఉంది. ప్రియమైన మిత్రులు రమేష్ ప్రసాద్. పూరి కొడుకు ఆకాష్ నటించిన ఈ సినిమాపెద్ద విజయం సాధించి టీం అందరికి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను.

    శేఖర్ కమ్ముల మాట్లాడుతూ...

    శేఖర్ కమ్ముల మాట్లాడుతూ...

    ప్రసాద్ ప్రొడక్షన్స్ లో పని చేయడం అదృష్టం. ప్రతిష్టాత్మక సంస్థలో నటించడం ఆకాష్ అదృష్టం. టీం అందరికి అల్ ది బెస్ట్. ఆకాష్ తండ్రి పేరు నిలబెట్టాలా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను అన్నారు.

    ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ...

    ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ...

    చాలా ఆనందంగా ఉంది. గర్వంగా ఉంది. పూరితో నాకున్న అనుబంధం, స్నేహం గురించి అందరికి తెలిసిందే. ఆకాష్ నా కొడుకుతో సమానం. మరాఠీలో చరిత్రను తిరగరాసిన చిత్రమిది. ఆకాష్ హీరో అయ్యేటప్పుడు మొదటి సినిమా ఎలా ఉంటుందని ఆలోచించేవాడిని.

    కసి కనపడింది...

    కసి కనపడింది...

    ప్రకాష్ రాజ్ కంటిన్యూ చేస్తూ..ఇలాంటి సినిమాతో పరిచయం కావడం ఆనందంగా ఉంది. ఇండస్ట్రీకి దిక్సూచి అయిన సంస్థ ద్వారా పరిచయమవుతున్నాడు. ఆకాష్ హీరో అవుతుండడంలో ఆశ్చర్యం లేదు. ధోని సినిమా సమయంలో ఆ కసి అతని కళ్ళలో కనపడింది. త్వరగా పెద్దవాడు అయిపోయే సినిమాలు చేయలని ఉండేది.

    ఆకలి ఎక్కువ

    ఆకలి ఎక్కువ

    ప్రకాష్ రాజ్ కంటిన్యూ చేస్తూ..ఆ వయసులో కమిట్మెంట్ కంటే ఆకలి ఎక్కువ ఉంది. ఓడిపోయే జాతి కాదు. సంస్కారం ఉంది, వినయం ఉంది. కానీ, చెప్పింది వినడు. తను చేయలనుకునేది చేస్తాడు. తనకంటూ ఓ ప్రత్యేకమైన బాణి తీసుకోస్తాడనే నమ్మకం ఉంది. సినిమా కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉంటాడు.

    పూరీ అలా పెంచాడు

    పూరీ అలా పెంచాడు

    ప్రకాష్ రాజ్ ఇంకా చెప్తూ..... తన నీడ పడకుండా, తనంతట తానూ నిలబడాలని పూరి పెంచాడు. పూరిని ఎంత ప్రేమించారో.. సినిమాను ఎంత ప్రేమించారో.. నన్ను ఎంత ప్రేమించారో.. తెలుసు. మా ప్రేమను మీముందు తాకట్టు పెట్టి అడుగుతున్నాం. ఆకాష్ ను ఆశీర్వదించండి. అని అన్నారు.

    దర్శకుడు రాజ్ మాదిరాజు మాట్లాడుతూ..

    దర్శకుడు రాజ్ మాదిరాజు మాట్లాడుతూ..

    వయసులో హీరో హీరోయిన్లు యంగ్ అయినా విపరీతమైన అనుభవం ఉంది. పాత్రలలో పరకాయ ప్రవేశం చేసి నటించారు అన్నారు.

    ఆకాష్ పూరి మాట్లాడుతూ..

    ఆకాష్ పూరి మాట్లాడుతూ..

    చిన్నతనం నుండి హీరో కావాలని ఉంది. దర్శకత్వం వైపు ఆలోచన లే పదహారేళ్ళ నుండి ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నాను. ఎందరో లెజెండ్స్ నటించిన ప్రసాద్ ప్రొడక్షన్స్ లో నటించడం నా అదృష్టం. అవకాశం ఇచ్చిన రమేష్ ప్రసాద్ గారికి థాంక్స్. నటనలో ఉల్కా గుప్తా కాంపిటీషన్ ఇచ్చింది. ఉత్తేజ్ గారు తెలంగాణ మాట్లాడడం నేర్పించారు. జోస్యభట్ల మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్బుతంగా ఇచ్చారు.

    ఆరేళ్ల తర్వాత అనుకున్నా..

    ఆరేళ్ల తర్వాత అనుకున్నా..

    మొదట ఈ సినిమా చేయలనుకోలేదు. ఆరేళ్ళ తర్వాత హీరోగా పరిచయం అవ్వాలనుకున్నాను. రాజ్ గారు నాన్నను కలిసిన తర్వాత టైంపాస్ సినిమా చూడమన్నారు. చూసిన తర్వాత భయం వేసింది. రాజ్ గారు నేరేషన్ ఇచ్చిన తర్వాత చేయాలనుకున్నాను. ప్రతి విషయంలో ఎంతో హెల్ప్ చేశారు.

    చదువు మానేసా...కోపరేట్ చేయండి

    చదువు మానేసా...కోపరేట్ చేయండి

    నాకు సినిమాలంటే ఇష్టం. ప్రస్తుతం చదువు మానేశాను. సినిమాలు తప్ప మరొక దిక్కు లేదు. దయచేసి కోపరేట్ చేయండి. నన్ను హీరోను చేయండి. ఇక్కడ నాన్న లేని లోటును ప్రకాష్ తీర్చారు. నేను మీముందు మైక్ పట్టుకుని మాట్లాడడానికి కారణం మా నాన్నే.

    చెప్పేదొక్కటే...

    చెప్పేదొక్కటే...

    ఈ సినిమా తర్వాత మూడేళ్ళు గ్యాప్ తీసుకుంటాను. అప్పుడు నన్ను హీరోగా లాంచ్ చేయండి చాలు, తర్వాత ఇంకేమి అడగను. ప్రేక్షకులకు చెప్పేదొక్కటే. నా పేరు ఆకాష్ పూరి, నన్ను గుర్తు పెట్టుకోండి. మళ్ళి వస్తాను అన్నారు.

    తెర వెనక,ముందు...

    తెర వెనక,ముందు...

    డా.శ్రీకాంత్, పూర్ణిమ, ఈశ్వర్‌రావ్, అరవింద్‌కృష్ణ,ఊర్మిళ కనిత్కర్, ఉత్తేజ్, అభినయ, శ్రీతేజ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం:ప్రవీణ్ వనమాలి, సంగీతం:డా.జె, ఆర్ట్:రాజీవ్ నాయర్, డ్యాన్స్:చంద్రకిరణ్, సాహిత్యం:సుద్దాల అశోక్‌తేజ,రామజోగయ్యశాస్త్రి, కిట్టు విస్సా ప్రగడ, కృష్ణ మదినేని, చక్రవర్తుల.

    English summary
    The audio launch event of Puri Jagannadh's son Aakash Puri's debut film as hero, 'Andhra Pori', directed by Raj Madiraju, was held at Rock Heights - Shilparamam in Hyderabad. Andhra Pori completed shooting formalities. The film is a Remake of Successful Marathi Film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X