పుత్రోత్సాహం : లాంచింగ్ లో పూరి జగన్ ఫ్యామిలీ(ఫొటోలు)

By Srikanya

హైదరాబాద్ :ప్రముఖ దర్శకుడు పూరిజగన్నాథ్‌ తనయుడు పూరి ఆకాష్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఆకాష్‌ కూడా హీరో అవుతాడని అందరూ ఊహించినదే. కాకపోతే అతని మొదటి సినిమా తన తండ్రి పూరిజగన్‌తో చేస్తాడనుకున్నారు. కానీ అందరి అంచనాలకు దూరంగా ..ఆకాష్‌ హీరోగా రాజ్‌ మదిరాజ్‌ దర్శకత్వంలో తొలి చిత్రం నేడు హైదరాబాద్‌లో ప్రారంభోత్సవం జరిగింది.

ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ప్రసాద్‌ ల్యాబ్స్‌ అధినేత రమేష్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఆంధ్రాపోరి' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో ఆకాష్‌ సరసన ఉల్కాగుప్తా హీరోయిన్‌గా నటిస్తుంది. ఉల్కా గుప్త ..ఝాన్సీ కి రాణి అనే హిందీ సీరియల్ లో చేసింది.

మరాఠీలో ఘన విజయం సాధించిన ‘టైంపాస్‌' అనే చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యూలర్‌ షూటింగ్‌ 2015 జనవరి నుంచి ప్రారంభంకానుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పూరి జగన్‌ దంపతులు, సాయిరామ్‌ శంకర్‌తో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

చిత్రం ఓపినింగ్ ఫొటోలు స్లైడ్ షో లో...

చైల్డ్ ఆర్టిస్టు నుంచీ ...

చైల్డ్ ఆర్టిస్టు నుంచీ ...

పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ ఇప్పటి వరకూ ‘గబ్బర్ సింగ్', ‘బుజ్జిగాడు', ‘ధోని' మొదలైన సినిమాలలో బాల నటుడిగా కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు.

మంచి అంచనాలే..

మంచి అంచనాలే..

ఇప్పటికీ అడపాదడపా తన వయసుకు దగ్గ సినిమాలు చేస్తూనే వస్తున్న ఆకాష్ ఇక నుంచి వాటికి బ్రేక్ ఇచ్చి సోలో హీరోగా అరంగేట్రం చేస్తూండటంతో మంచి అంచనాలే ఉన్నాయి.

మరాఠీ రీమేక్..

మరాఠీ రీమేక్..


ఉల్కా గుప్త హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం టైం పాస్ అనే మరాఠీ చిత్రం రీమేక్.

రెగ్యులర్ షూటింగ్..

రెగ్యులర్ షూటింగ్..

జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరిగుతుందని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు

ఎంటర్టైనర్...

ఎంటర్టైనర్...

ఈ చిత్రం మంచి ఫన్ తో కూడిన ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. అప్పుడే యుక్త వయస్సులోకి వస్తున్న పిల్లల మధ్య నడిచే లవ్ స్టోరీ అంటున్నారు.

తల్లి తండ్రి వచ్చారు

తల్లి తండ్రి వచ్చారు

హీరోగా లాంచ్ అవుతున్న ఆకాష్ ని ఆశ్వీరదించటానికి తల్లి,తండ్రి వచ్చారు.

బాబాయ్ కూడా

బాబాయ్ కూడా

బాబాయ్ సాయిరామ్ శంకర్ ఈ లాంచింగ్ కు వచ్చి శుభాకాంక్షలు తెలియచేసారు.

శుభాకాంక్షలు..

శుభాకాంక్షలు..

ఈ ఓపినింగ్ లో...పలువురు చిత్ర రంగ ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలియచేసారు.

నెంబర్ 30

నెంబర్ 30

ప్రసాద్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెంబర్ 30 గా లో తీయబడుతున్న ఈ చిత్రంకి కెమెరా ప్రవీణ్ వనమాలి సమకూరుస్తున్నారు.

మరాఠీలో హిట్

మరాఠీలో హిట్


ఈ చిత్రం మరాఠీలో టైం పాస్ పేరుతో వచ్చి సూపర్ హిట్ అయ్యింది. దాంతో ఇక్కడా బాగా ఆడుతుందని అంటున్నారు.

టైటిల్ తోనే

టైటిల్ తోనే

ఈ చిత్రం టైటిల్ ఎట్రాక్టివ్ గా ఉందని సినీ వర్గాలు అంటున్నారు. టైటిల్ తోనే సినిమా ప్రమోషన్ జరిగిందని, పూరి కొడుకు లాంచ్ కాబట్టి ఖచ్చితంగా మంచి ఓపినింగ్స్ ఉంటాయని చెప్తున్నారు.

ఎవరెవరు...

ఎవరెవరు...

కో డైరక్టర్ గా రమేష్ నారాయణ్, ప్రొడక్షన్ కంట్రోలర్ గా ఉమా మహేష్ .సిహెచ్, పాటలు...సుద్దాల అశోక్ తేజ, రామ జోగయ్య శాస్త్రి, కిరణ్ చక్రవర్తుల, కృష్ణ మాదినేని, కిట్టు విస్సు ప్రగడ,సంగతీ డా.జోశ్యభట్ల అందిస్తున్నారు. స్క్రీన్ ప్లే,మాటలు, దర్శకత్వం రాజ్ మాదిరాజు అందిస్తూండగా, రమేష్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X