twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఆకాశ గోపురం' ఆగస్టు 22న

    By Staff
    |

    Mohanlal
    మళయాళం లో రిలీజుకు ముందే సంచలనం సృష్టిస్తున్న చిత్రం 'ఆకాశ గోపురం'. సౌత్ లో మొదటి సారిగా పూర్తిగా యు.కె(లండన్) లో నిర్మితమైన ఈ చిత్రంలో మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరక్టర్ కె.పి.కుమరన్ దర్శకత్వంలో నిర్మితమైన ఈ చిత్రం ప్రముఖ నాటకకారుడు ఇబ్సన్ రచించిన క్లాసికి్ ప్లే 'ది మాస్టర్ బిల్డర్' ను సినిమాకి ఎడాప్ట్ చేసి చేస్తున్నారు. 1892 లో మొదటిసారి పబ్లిష్ అయిన ఈ నాటకం బెర్లిన్ లో జనవరి 19న 1893లో మొదటిసారు ప్రదర్శించారు.

    పర్శనల్ ,పబ్లిక్ లైఫ్ లు రెండూ మనిషికి అవసరమే.ఏది నిర్లక్ష్యం చేసినా దానికి చాలా పెద్ద మొత్తంలో మూల్యం చెల్లించాల్సి వస్తుంది. నేటి ఆధునిక సమాజంలో పూర్తి ఉద్యోగ భాద్యతలలో పడి కుటుంబాన్ని పట్టించుకోకుండా పోయేవారికి ఇది కళ్ళు తెరిపించే సినిమా అని దర్శక,నిర్మాతలు భావించి నిర్మిస్తున్నారు.

    ఈ నాటకం Halvard Solness అనే మిడిల్ ఏజ్ ఆర్కిటిస్ట్ చుట్టూ తిరుగుతుంది.ఎప్పుడూ తన వృత్తిలో నిమగ్నమైపోయి ప్రైవేట్ లైఫ్ ని నిర్లక్ష్యం చేస్తూండటంతో అతని భార్య Aline ఇబ్బందిపడుతూంటుంది. అదే సమయంలో అతని ఫర్మ్ లో Knut Brovik అనే అసిస్టెంట్ ఉంటుంది. ఆమె పరిస్ధితి టోటల్ రివర్స్ లో ఉంటుంది.ఆమె నుండి హీరో అతనికి కావల్సిన జీవిత పాఠాలు నేర్చుకోవటంతో కథనం ఊపందుకుంటుంది. ఇక ఈ ప్లే లో క్లైమాక్స్ అద్బుతంగా ఉంటుంది. ఈ నాటకం దాదాపు 60 సంవత్సరాలనుండి మళయాళంలోకి అనువాదమై ప్రదర్శించబడుతూనే ఉంది. దాంతో ఈ సినిమాని అందరూ అభినందిస్తారని ఆసిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X