ఆకాశం నీ హద్దురా సెలబ్రిటీ రివ్యూ.. వెంకటేష్, మోహన్‌బాబు ఇతర నటులు ఏమన్నారంటే..

విలక్షణ నటుడు సూర్య, గురు ఫేమ్ సుధా కొంగర కాంబినేషన్‌లో వచ్చిన ఆకాశం నీ హద్దురా చిత్రం విడుదలై సాధారణ ప్రేక్షకులు, సినీ ప్రముఖుల నుంచి మంచి స్పందనను మూటగట్టుకొంటున్నది. లాక్‌డౌన్ కారణంగా థియేటర్లలో కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. నవంబర్ 12న రిలీజైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను సూర్య, ఇతర నటీనటులు పెర్ఫార్మెన్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా పలువురు సెలబ్రిటీలు ట్వీట్ చేసి ప్రశంసిస్తున్నారు. ఎవరెవరూ ఏమన్నారంటే...

వెంకటేష్ సినిమా గురించి

వెంకటేష్ సినిమా గురించి

ఆకాశం నీ హద్దురా గురించి సినీ హీరో వెంకటేష్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. ఇప్పుడే ఈ సినిమాను చూశాను. ఈ మూవీ ఎమోషనల్, స్పూర్తిదాయకంగా ఉంది. ఇన్సిపిరేషన్‌గా ఉన్న కథను డైరెక్ట్ చేసిన సుధా కొంగర గ్రేట్ జాబ్ చేసింది. సూర్య నటనను తెరపై చూసి గొప్ప అనుభూతిని పొందాను అంటూ విక్టరీ వెంకటేష్ ట్వీట్ చేశారు.

సూర్య లాంటి నటుడితో పనిచేయడం

సూర్య లాంటి నటుడితో పనిచేయడం

సూర్య లాంటి నటుడితో పనిచేయడం గొప్ప అనుభూతి. సుధా కొంగర వండర్‌ఫుల్ డైరెక్టర్. అమెజాన్‌లో రిలీజైన ఈ చిత్ర యూనిట్‌కు బెస్టాఫ్ లక్. ఈ సినిమా చరిత్రలో ఈ చిత్రం మైలురాయిగా నిలువాలి అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఓ కీలక పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.

 రామజోగయ్య శాస్త్రి ట్వీట్ చేసి

రామజోగయ్య శాస్త్రి ట్వీట్ చేసి

ఆకాశం నీ హద్దురా సినిమా గురించి రచయిత రామజోగయ్య శాస్త్రి స్పందిస్తూ.. నా ఉదయం అద్భుతంగా ప్రారంభమైంది. లేవడంతోనే ఈ సినిమా గురించి గొప్ప రివ్యూలను చూశాను. ఈ సినిమాతో అనుబంధం ఉన్నందుకు గర్వంగా ఉంది. సూర్య పెర్ఫార్మెన్స్‌తో ఇరుగదీశారు. జీవి ప్రకాశ్ సంగీతం ఈ సినిమాకు బలమైన పిల్లర్‌గా నిలిచింది. ఈ కథను తెరకెక్కించాలనే పదేళ్ల తన కలను సుధా కొంగర నెరవేర్చుకొన్నారు అంటూ ఆయన ట్వీట్ చేశారు.

మంచు విష్ణు ట్వీట్

మంచు విష్ణు ట్వీట్

ఆకాశం నీ హద్దురా! చిత్రంపై మంచు విష్ణు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ట్వీట్ చేసి.. నా బిగ్ బ్రదర్ సూర్య‌కు, దర్శకురాలు సుధా కొంగర‌కు కంగ్రాట్స్.తెలుగులో విడుదలైన ఆకాశం నీ హద్దురా, తమిళంలో విడుదలైన సురైరా పొట్రూ చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నది. ఈ సినిమా గురించి మంచి రివ్యూలు వస్తున్నాయి. ఇలాంటి గొప్ప అనుభూతిని అందిస్తున్న సమయంలో పార్టీ ఇవ్వాల్సిందే అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

సూర్య నటన అద్భుతం..

సూర్య నటన అద్భుతం..

ఆకాశం నీ హద్దురా సినిమాలో సూర్య నటన గురించి కమెడియన్ యోగి బాబు స్పందిస్తూ.. మీరు గెలిచారు సూర్య గారు.. మీ నటన అద్భుతంగా ఉంది. 2020లో రిలీజైన సినిమాల్లో బెస్ట్ మూవీ. ఈ సినిమాను థియేటర్లలో విజయోత్సవం జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

మీ పెర్ఫార్మెన్స్ అవుట్‌స్టాండింగ్

మీ పెర్ఫార్మెన్స్ అవుట్‌స్టాండింగ్

తమిళ నటుడు అరుణ్ విజయ్ స్పందిస్తూ.. సూర్య బ్రదర్.. మీ పెర్ఫార్మెన్స్ అవుట్‌స్టాండింగ్. ఈ సినిమాలో ఇతర పాత్రధారులు తమ రోల్స్‌ను అద్భుతంగా పోషించారు. అందరికి స్పూర్తిని కలిగించి చిత్రం. దర్శకురాలు సుధా కొంగరకు హ్యాట్సాఫ్. టీమ్ అద్బుతంగా పనిచేసింది అని అంటూ ట్వీట్ చేశారు.

సుధా కొంగరకు కంగ్రాట్స్

సుధా కొంగరకు కంగ్రాట్స్

నటి శ్రీయారెడ్డి కూడా సురారై పొట్రూ (తమిళంలో) గురించి మాట్లాడుతూ... సుధా కొంగరకు కంగ్రాట్స్. సినిమా చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది. స్క్రీన్‌పై పాత్ర కోసం చూపిన అంకితభావం కనిపించింది. మీ కష్టం ప్రతీ సీన్‌లో కనిపించింది అంటూ శ్రీయారెడ్డి ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X