Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్‌కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆకాశం నీ హద్దురా ట్విట్టర్ రివ్యూ.. గుండెను పిండేశాడు సూర్య.. తలవంచి నమస్కరిస్తున్నాం..
సాధారణ స్థాయి నుంచి పారిశ్రామిక వేత్తగా మారిన కెప్టెన్ గోపినాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఆకాశం నీ హద్దురా మూవీ ప్రేక్షకుల ప్రశంసలు అందుకొంటున్నది. తక్కువ ధరకు టికెట్ అందించాలన్న లక్ష్యంతో ఎయిర్ డెక్కన్ విమానయాన సంస్థను స్థాపించిన కెప్టెన్ గోపినాథ్ పాత్రను సూర్య అద్బుతంగా పోషించారనే విషయాన్ని నెటిజన్లు ప్రశంసల ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు ఇలా ఉన్నాయి.
స్పూర్తిదాయకమైన కథగా..
సూపర్ (జకాస్), ఎక్సలెంట్ మూవీ. ఓ సాధారణ యువకుడు విమానయాన సంస్థను ఏర్పాటు చేయాలన్న కథ అనుక్షణం స్పూర్తిని కలిగించింది. సూర్య తన నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకొన్నారు. వాస్తవ కథను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు నా రేటింగ్ 4.24/5 అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
సూర్య పరిపూర్ణమైన నటుడిగా
ఆకాశం నీ హద్దురా మూవీలో ఎయిర్పోర్ట్ సీన్ డీసెంట్‌గా ఉంది. ఈ చిత్రంలో సూర్య పరిపూర్ణమైన నటుడిగా ఆవిష్కరించారు అపర్ణ బాల మురళి తన పాత్రతో అదరగొట్టేసింది. సుధా కొంగర డైరెక్షన్ అద్భుతం. జీవీ ప్రకాశ్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గుడ్ అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు.
నేషనల్ అవార్డు రావడం గ్యారెంటీ
ఆకాశం నీ హద్దురా సినిమాలో ఎయిర్‌పోర్టు సీన్ హృదయాన్ని కదలించింది. సూర్య నటన అద్భుతం. ఈ సినిమాలో ఆయన నటనకు నేషనల్ అవార్డు రావడం తథ్యం. ఆకాశం నీ హద్దురా సినిమా అద్భుతంగా ఉంది అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.
తలవంచి నమస్కరిస్తున్నాను
ఆకాశం నీ హద్దురా సినిమా చూశాను. ఈ చిత్రంలో సూర్య నటనకు తలవంచి నమస్కరిస్తున్నాను. సుధా కొంగర డైరెక్షన్, జీవీ ప్రకాశ్ మ్యూజిక్ బాగుంది. ఓటీటీలో ఆకాశం నీ హద్దురా సినిమా అతిపెద్ద బ్లాక్బాస్టర్ కావడం వాస్తవం. థియేటర్లలో రిలీజైతే మాస్ ఇంపాక్ట్ చూపించడం ఖాయం. తప్పకుండా ఈ సినిమా చూడండి అంటూ మరో నెటిజన్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
భావోద్వేగంతో కుదిపేస్తాయి..
ఆకాశం నీ హద్దురా చిత్రం అద్భుతంగా ఉంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు హృదయాన్ని భావోద్వేగంతో కుదిపేస్తాయి. సూర్య పరిపూర్ణమైన నటుడిగా మరోసారి తన పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకొన్నారు. సుధా కొంగర డైరెక్షన్ చాలా బాగుంది అంటూ ఓ నెటిజన్ ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు.
మీ నటనకు ఆకాశమే హద్దుగా
ఆకాశం నీ హద్దురా చిత్రం చూసిన తర్వాత నోట మాటలు రావడం లేదు. మీ నటన వల్ల కలిగిన షాక్ నుంచి తేరుకోలేకపోతున్నాం. మీ నటనకు ఆకాశమే హద్దు. మీ సినిమాలో రాసుకొన్న క్యారెక్టర్లకు మేము కంగ్రాట్స్, థ్యాంక్స్ కంటే ఏమి చెప్పలేం. సూర్య చేత అద్భుతమైన పాత్రను చేయించినందుకు కంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేశారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయొద్దు
ఆకాశం నీ హద్దురా సినిమాను ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. ఓ యువకుడు తన కలను ఎలా సాకారం చేసుకొన్నాడనే విసయాన్ని తెరపైన అద్భుతంగా చూపించారు. నా రేటింగ్ 80/100. పిల్లల్ని ఎలా పెంచాలో తెలియజేప్పే చిత్రం అంటూ ఓ నెటిజన్ చెప్పారు.