‘ఆఖరి అన్వేషణ’ లో ప్రపంచ సుందరి
నినోద్ చోప్రా దర్శకత్వంలో నిర్మాత టి దుర్గారావు నిర్మిస్తున్న హారిబుల్ చిత్రం 'ఆఖరి అన్వేషణ" హిందీలో రూపొందిన 'మిస్టర్ షక్ చిత్రాన్ని" కి వినోద్ చోప్రానే దర్శకత్వం వహించారు. ఇదే చిత్రాన్ని తెలుగులో విఘ్నేష్ పిక్చర్స్ పతాకంపై 'ఆఖరి అన్నేషణ" నేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్ర కథాంశం పరంగా 'కోట్ల ఆస్తికి వారసురాలైన హీరోయిన్నుకొందరు చంపాలని కుట్ర పన్నుతారు. ఈ క్రమంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. తనను చంపాలనుకున్న దుష్టశక్తుల నుండి హీరోయిన్ ఎలా తప్పించుకుని బయటపడిందనేదే ప్రధానాంశంగా చిత్రీకరించారు. ఈ చిత్రం యొక్క ఆద్యాంశాలు ఒక థ్రిల్లింగ్ రొమాంటిక్ మర్డర్ మిస్లరీగా ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైంది. అక్టోబర్ రెండోవారంలో విడుదల చేయడానికి సన్నాహాలు సద్దంచేస్తున్నాం అన్నారు. జాంకీషా, ధనుంజయ్ చౌహాన్, ఆర్తిపురి తదితరులు ముఖ్యపాత్రల్ని పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











