జనార్ధన మహర్షి ‘దేవస్థానం’లో నటి ఆమని

By Bojja Kumar

సర్వేజనా సుఖినోభవంతు ఫలింస్ పై ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'దేవస్థానం". కళాతపస్వి, పద్వశ్రీ కె.విశ్వనాథ్, గాన గంధర్వుడు, పద్మ భూషణ్ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ప్రధాన పాత్ర దారులుగా రూపొందనున్న ఈ చిత్రానికి దర్శకుడు జనార్ధన మహర్షి. ఇందులో ప్రముఖ నటి ఆమని ఓ కీలక పాత్ర పోషించనున్నారు. కొంత గ్యాప్ తర్వాత ఆమె నటిస్తున్న చిత్రం ఇది.

ఈ సందర్భంగా ఆమని మాట్లాడుతూ '' గతంలో విశ్వనాథ్ గారి దర్శకత్వంలో బాలసుబ్రహ్మణ్యం గారు నిర్మించిన 'శుభ సంకల్పం"లో నేను నటించాను. ఆ చిత్రం నాకు మంచి పేరు, ప్రఖ్యాతలు తెచ్చి పెట్టింది. ప్రస్తుతం వీరి కాంబినేషన్ లో జనార్ధన మహర్షి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ 'దేవస్థనం"లో నటిస్తున్నందుకు ఆనందంతో పాటు ఒకింత గర్వంగా కూడా ఉంది. ఒక మంచి చిత్రంలో మంచి పాత్ర చేస్తున్నాను. నా పాత్రలో పాటు ఈ చిత్రకథ, ఇతర నటీనటుల పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయి"" అన్నారు.

దర్శకుడు జనార్ధన మహర్షి మాట్లాడుతూ...అక్టోబరు 10 నుంచి చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధి పొందిన పలు దేవాలయాల్లో ఈ చిత్రం షూటింగ్ ఆరంభించి సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రం ద్వారా వివిధ కళారంగాలకు చెందిన పలువురు ప్రముఖులను నటీనటులుగా పరిచయం చేయబోతున్నాం. ఓ వైవిధ్యభరితమైన కథాంశంతో అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం"" అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సురేష్ కుమార్, సంగీతం: స్వరవాణి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X