రాజమౌళికి అమీర్ ఖాన్ ఆఫర్!
'ఈగ' చిత్రం తర్వాత రాజమౌళి ప్రభాస్‌తో భారీ చిత్రానికి ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ చరిత్రలోనే హయ్యెస్ట్ బడ్జెట్ చిత్రంగా దీన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్‌తో చేస్తున్న మూవీ హిందీలో రీమేక్ చేస్తే తాను నటిస్తానని, రాజమౌళిపై తనకు నమ్మకం ఉందని అమీర్ ఖాన్ అన్నట్లు సమాచారం. ఇప్పుడప్పుడే బాలీవుడ్లో అడుగు పెట్టే ఆలోచన లేదని చెప్పిన రాజమౌళి అమీర్ ఖాన్ ఆఫర్ పై ఎలా స్పందిస్తాడో...
ప్రభాస్-రాజమౌళి చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆర్కా మీడియా బేనర్‌పై నిర్మాత దేవినేని ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఛత్రపతి చిత్రంతో ప్రభాస్‌కు భారీ విజయాన్ని అందించిన రాజమౌళి ఈ సారి సరికొత్త కోణంలో యంగ్ రెబల్ స్టార్‌ను చూపెట్టబోతున్నారు.
'అందాల రాక్షసి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ లావణ్య త్రిపాటి ఈ చిత్రంలో చాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందాల రాక్షసి చిత్రంలో ఆమె పెర్ఫార్మెన్స్ నచ్చి రాజమౌళి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ హీరోయిన్ శృతి హాసన్ ఈచిత్రంలో మెయిన్ హీరోయిన్ గా చేయనుందని సమాచారం. ఈ విషయాలు అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications












