చివరకు బయటపడ్డ ‘ఢిల్లీ బెల్లీ ’ రహస్యం
బాక్సాఫీస్ లో ఒక సినిమా విజయవంతం అవ్వాలంటే ఏ రకంగా ప్రమోట్ చేస్తే అవుతుందో ఆ ట్రిక్కులన్నీ తెలిసిన వాడు అమీర్ ఖాన్. అయితే, ఈ నటుడు పరిస్ధితులకనుగుణంగా అనేక రహస్యాలను తనలో దాచేసుకో గలడన్న సంగతి కూడా చాలా మందికి తెలియదు.
ఇక అసలు విషయానికి వస్తే, ఇటీవల అమీర్ నిర్మించిన 'ఢిల్లీ బెల్లీ" లోని ప్రమోషనల్ సాంగ్ 'ఐ హేట్ యూ..." గురించిన ఒక షాకింగ్ సీక్రెట్ బయటపడింది. అసలు, ఈ ప్రమోషనల్ సాంగ్ 'ఐ హేట్ యూ" అమీర్ మూడు సంవత్సరాల కిందటే మరో ఫిల్ము కొరకు తీశాడట. అప్పట్లో, ఈ నటుడు ఈ పాటకు తన పక్కన నటించమంటూ కొంతమంది పేరొందిన నటీమణులను కోరాడట. అయితే, దానిలో అతని సరసకు రావటానికి ఏ నటీ ఒప్పుకోలేదు. తాను అనుకున్నట్లు జరగలేదు. అమీర్ చివరకు ఒంటరిగానే ఆ ఐటమ్ పూర్తి చేశాడు.
తీసిన సాంగ్ ను, భవిష్యత్తులో ఎప్పటికైనా పనికి రాకపోతుందా అంటూ... రిజర్వులో పెట్టుకోటానికి నిర్ణయించుకున్నాడు. చివరకు తాను తీసిన ఆ పాట ఆయన మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కు గొప్పగా సరిపోతుందని ఎవరనుకుంటారు? ఎవరో కొంతమంది అమీర్ ను ఆ పాటలో అలా వున్నావేంటి? అని ప్రశ్నించగా అమీర్ ఖాన్ పాట కొరకు తన మీసాలను డిజిటల్ గా తీసేశానన్నాడట. సుమారు మూడు నెలల నుండి అమీర్ రీమా కగ్తి తీస్తున్న ఒక సినిమా కొరకు గాను తన మీసాలను పెంచుతున్నాడు. రహస్యం బయట పడింది!
కనుక అమీర్ ఖాన్ తన సీక్రెట్లను ప్రేక్షకులు కూడా పట్టుకోలేనంతా మేనేజ్ చేసేస్తుంటాడని చెప్పచ్చు.


Click it and Unblock the Notifications











