తీవ్రమైన జ్వరంతో బాధ పడుతున్న సూపర్ స్టార్
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్‌ఖాన్ 103 డిగ్రీల తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దాంతో ఆయన తాజా చిత్రం 'పిప్లీలైవ్' ప్రచార కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ఫేస్ బుక్ లో ప్రస్దావిస్తూ..."నా సినిమా విడుదలకు కొద్ది రోజులే ఉన్నా తీవ్ర అస్వస్థత వల్ల మంచం దిగలేకున్నా. చివరగా నిర్వహించాలనుకున్న అన్ని ప్రచార కార్యక్రమాలు రద్దు చేసుకున్నా" అన్నారు.
జర్నలిస్టుగా ఉన్న అనూష రిజ్విని దర్శకత్వంలో అమీర్ ఖాన్ 'పీప్లి లైవ్' అనే సినిమాను నిర్మించారు. రైతుల ఆత్మహత్యలు..రాజకీయ నాయకుల ఓదార్పులు..వాటిపై మీడియా కథనాలు..వీటి చుట్టూ అల్లుకొన్న కథ ఇది. ఈ నెల 13న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ లో ఈ సినిమాను 200 ప్రింట్లతో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో రఘుబీర్ యాదవ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, మలైకా షెనాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











