అమీర్ ఖాన్ 'త్రి ఇడియట్స్' చిత్రం లీగల్ డౌన్ లోడ్
అమీర్ ఖాన్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన త్రి ఇడియట్స్ ని నెట్ నుంచి లీగల్ గానే డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తామంటున్నారు దర్శక, నిర్మాతలు. ఈ విషయమై నిర్మాత విధు వినోద్ చోప్రా మాట్లాడుతూ..ఇది మేం మొదటిసారిగా ప్రారంభిస్తున్నాం..ఈ చిత్రాన్ని రిలీజైన పన్నెండు వారాల తర్వాత యూ ట్యూబ్ ద్వారా చట్టబద్దంగా డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు. ఇది ఎందుకోసం అంటే మల్టిఫ్లెక్స్ లు డబ్బులు పెట్టి వెళ్ళలేని ప్రేక్షకులను అందుకోవటం కోసమే అని అంటున్నారు. అలాగే పెద్ద తెరపై చూడలేక మా సినిమాపై ఆశ చంపుకోలేక ఇబ్బంది పడే వారు పైరసీని ఆశ్రయిస్తారు. వారికోసమే ఈ పెసిలిటీ ప్రారంభిస్తున్నాం. పైరసీని అరికట్టాలనే ఈ ఆలోచన. కేవలం 12 వారాలు(మూడు నెలలు) ఆగితే మంచి క్వాలిటీ ప్రింట్ ని డౌన్ లోడ్ చేసుకుని చూడచ్చు..కంగారుపడద్దు అంటున్నారాయన. ఇంతకీ హిట్ సినిమాని చూడకుండా అంత కాలం ఆగగలరా అన్నదే అసలు ప్రశ్న.


Click it and Unblock the Notifications











