twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ తెలుగు రీమేక్‌లో అమీర్ ఖాన్

    By Bojja Kumar
    |

    క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ స్వీయ నిర్మాణంలో రూపొందిన సినిమా 'ఆకాశమంత'. రాధా మోహన్ దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రం కలెక్షన్లు పెద్దగా రాబట్టలేక పోయినా....ఒక మంచి ఫీల్ గుడ్ చిత్రంగా ప్రకాష్ రాజ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా ఈచిత్రాన్ని బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ చేయబోతున్నారు. ప్రకాష్ రాజ్ పోషించిన పాత్రను అమీర్ పోషిస్తారని తెలుస్తోంది.

    బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన అమీర్‌కి ఇతర హీరోల కంటే ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. తన చేయబోయే సినిమా ఇటు ఎంటర్‌టైన్మెంట్‌తో, మెసేజ్ పుల్‌గా, ఫీల్ గుడ్‌గా ఉండేలా చూసుకుంటాడు. ఆయన ఏ పాత్ర పోషించినా దానికో అర్థం ఉంటుంది. ఆకాశమంత సినిమా చూసిన తర్వాత బాగా ఇంప్రెస్ అయిన అమీర్‌ఖాన్ ప్రకాష్ రాజ్ పోషించిన పాత్ర తనకు బాగా సూట్ అవుతుందని ఫిక్స్ అయ్యారట.

    హిందీలో ఈచిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అయితే మరి దర్శకత్వం వహించేది ఎవరు అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

    అమీర్ ఖాన్ తాజాగా 'సత్యమేవ జయతే' అనే టీవీ రియల్టీ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని సమస్యలు, దురాచారాలను వెలుగెత్తి చూపిస్తూ వాటి నిర్మూలన దిశగా ముందుకు సాగుతున్నాడు ఈ స్టార్ హీరో. స్టార్ టీవీలో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమానికి మంచి రెస్పాన్ వస్తోంది.

    English summary
    Bollywood hero success mantra is to remake super hit films of south to get a commerical hit while Bollywood perfectionist Aamir Khan looks no different to some extent. Well, if the buzz is to be believed, Prakash Raj, who earlier produced Abhiyum Naanum (Akasamantha in Telugu), will be directing this Hindi remake. And Aamir Khan will be enacting the father’s role – originally played by Prakash Raj in Telugu and Tamil. Now isn’t that interesting?
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X