భార్య కిరణ్‌రావుకు విడాకులు ఇచ్చిన అమీర్ ఖాన్.. 15 ఏళ్ల దాంపత్య జీవితానికి తెర!
బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ దాంపత్య జీవితం మరోసారి విఫలమైంది. తన రెండో భార్య కిరణ్‌రావుకు విడాకులు ఇచ్చినట్టు అమీర్ అధికారికంగా ప్రకటించారు. దీంతో అమీర్, కిరణ్ రావు 15 ఏళ్ల వైవాహిక జీవితానికి తెరపడింది. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

అమీర్ ఖాన్ మొదటి పెళ్లి..
అమీర్ ఖాన్ వైవాహిక జీవితం విషయానికి వస్తే.. తొలుత హీరోయిన్ రీనా దత్తాను ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. వీరిద్దరికి ఇరా ఖాన్, జునైద్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
వ్యక్తిగత అభిప్రాయ భేదాలు తలెత్తడంతో 16 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత అమీర్, రీనా దత్తా 2002లో విడాకులు తీసుకొన్నారు.

కిరణ్ రావుతో రెండో పెళ్లి..
ఆ తర్వాత లగాన్ సినిమా షూటింగులో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కిరణ్ రావుతో ప్రేమలో పడ్డారు. అనంతరం 2005 డిసెంబర్ 28 తేదీన అమీర్ రెండో వివాహం చేసుకొన్నారు. అమీర్, కిరణ్‌కు సర్రోగసి ద్వారా 2011లో ఆజాద్ అనే కుమారుడు కలిగాడు. అయితే మరోసారి వ్యక్తిగత విభేదాలు అమీర్ కాపురంలో తలెత్తడంతో కిరణ్ నుంచి విడాకుల తీసుకొన్నారు.

విడాకులపై అమీర్ ఖాన్, కిరణ్ సంయుక్త ప్రకటన
అమీర్ ఖాన్, కిరణ్ రావు సంయుక్తంగా ప్రకటనను విడుదల చేస్తూ.. మా 15 సంవత్సరాల వైవాహిక జీవితంలో జీవితానికి సరిపడే అద్బుతమైన అనుభవాలను, సంతోషాన్ని, ఆనందాన్ని పంచుకొన్నారు. మా బంధం ఒక నమ్మకం, గౌరవం, ప్రేమ అనే పునాదుల మీద బలపడింది. అయితే ఇప్పుడు మేము కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకొంటున్నాం. మేమిద్దరం భార్య, భర్తలుగా ఉండలేము. నా బిడ్డకు తల్లితండ్రులుగా ఉంటూనే వేర్వేరుగా జీవించాలని నిర్ణయం తీసుకొన్నాం అని వారు పేర్కొన్నారు.

కొద్ది రోజుల క్రితమే నిర్ణయం అంటూ
అమీర్, కిరణ్ రావు తమ ప్రకటనలో స్పందిస్తూ.. కొద్ది రోజలు క్రితమే మేము సపరేట్ కావాలని నిర్ణయించుకొన్నాం. కానీ వేర్వేరుగా జీవించడానికి కొంత సమయం పట్టింది. అన్ని ఏర్పాట్లు చేసుకొన్న తర్వాత ఈ నిర్ణయాన్ని అమలు చేశాం. మా కుమారుడు ఆజాద్‌కు తల్లిదండ్రులుగా అంకితభావాన్ని ప్రదర్శిస్తాం. మా ఇద్దరి పర్యవేక్షణలో ఆజాద్ పెరుగుతాడు. మేము కలిసి సినిమాలు నిర్మిస్తాం. పానీ ఫౌండేషన్ కార్యక్రమాలు కొనసాగిస్తాం. అలాగే ఇతర ప్రాజెక్టుల్లో కూడా భాగస్వామ్యం అవుతాం అని పేర్కొన్నారు.

ఆజాద్‌కు తల్లిదండ్రులుగానే..
మా బంధాన్ని గౌరవిస్తూ.. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన నా కుటుంబానికి, స్నేహితులకు, సన్నిహితులకు థ్యాంక్స్. విడాకులతో మా ఇద్దరి మధ్య ప్రయాణం ఆగిపోదు అని స్పష్టం చేస్తున్నాం. ఇదివరకు మాదిరిగానే మాకు మీ దీవెనలు, ఆశీస్సులు ఉండాలని శ్రేయోభిలాషుల నుంచి కోరుకొంటున్నాం అని ప్రకటనలో పేర్కొన్నారు. అమీర్, కిరణ్ రావు ఇద్దరు సంతకం చేసిన ప్రకటనను మీడియాకు విడుదల చేశారు.


Click it and Unblock the Notifications











