పికె ప్రెస్ మీట్ : రాజమౌళిపై అమీర్ ఖాన్ ప్రశంసలు(ఫోటోస్)
హైదరాబాద్: ‘లింగా' ఆడియో విడుదల సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.....బాహుబలి డిఫరెంట్ సినిమా, ఆ సినిమా చిత్రీకరణకు ఎక్కువ సమయం పట్టడానికి కారణం ఉంది. అది రెండు పార్టులుగా వస్తోంది. రాజమౌళి ఇండియాలో నెం.1 టెక్నీషియన్. అలాంటి వ్యక్తి తెలుగు సినీ పరిశ్రమలో ఉండటం తెలుగువారి అదృష్టం అంటూ ప్రశంసించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ రోజు రాజమౌళిని ప్రశంసిస్తూ....బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ రాజమౌళి గురించి మాట్లాడారు. తన తాజా సినిమా ‘పికె' ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆయన మాట్లాడుతూ....‘రాజమౌళి గురించి నాకు బాగా తెలుసు. బాగా టాలెంట్ ఉన్న డైరెక్టర్. కంటెంట్ ఉన్న క్రియేటివ్ డైరెక్టర్. అవకాశం వస్తే తప్పకుండా అతనితో కలిసి పని చేస్తా' అన్నారు.
‘పికె' సినిమా విభిన్నంగా, ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీర్ ఖాన్, అనుష్క దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తదితరులు పాల్గొన్నారు. స్లైడ్ షోలో పికె ప్రెస్ మీట్ ఫోటోస్..

రాజ్ కుమార్ హిరానీ, అమీర్ ఖాన్
రాజ్ కుమార్ హిరాణీ, అమీర్ ఖాన్ కాంబినేషన్ లో '3 ఇడియెట్స్' తర్వాత 'పీకే' చిత్రం రూపొందుతోంది.

విభిన్నంగా, నగ్నంగా...
ఈ చిత్రంలో అమీర్ ఖాన్ విభిన్నమైన వేషధారణతో, నగ్నంగా కనిపించబోతున్నాడు.

అనుష్క శర్మ
ఈ చిత్రంలో అనుష్క శర్మ ప్రధాన పాత్రలో కనిపించబోతోంది. అమీర్ ఖాన్ తో పోటీ పడుతూ నటించింది.

విడుదల
డిస్నీ ఇండియా, విధూ వినోద్ ఫిల్మ్స్, రాజ్ కుమార్ హిరాణీ ఫిల్మ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 19 విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











