అల్లు అర్జున్ మ్యారేజికి దేశం నలుమూలల నుండి అతిరధ మహారధులు

By Nageswara Rao

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ త్వరలో జరగనున్న అల్లు అర్జున్ మరియు స్నేహా రెడ్డిల పెళ్శికి ముఖ్య అతిదిగా రానున్నారని సమాచారం. ఫిలిం నగర్ సమాచారం మేరకు అల్లు అర్జున్ పెళ్శికి భారతదేశం నలుమాలల నుండి కూడా చాలా మంది అతిధులు రానున్నారని వినికిడి. మార్చి 6వ తేదీన హైదరాబాద్ హైటెక్స్ గ్రౌండ్స్‌లో అల్లు అర్జున్ మ్యారేజి అత్యంత ఘనంగా అభిమానుల మద్య జరపాలని నిర్ణయం తీసుకన్న విషయం తెలిసిందే.

ఈపెళ్శికి తమిళనాడు నుండి అతిరధ మహారధలు రానున్నారు. ముఖ్యంగా తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్, కమల్ హాసన్, సూర్య, ధనుష్, సూర్య తమ్ముడు కార్తి కూడా హాజరుకానున్నట్లు సమాచారం. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ రాక మాత్రం ఇంకా ఖచ్చితంగా నిర్ధారణ కాలేదు. ఇక కర్ణాటక విషయానికి వస్తే లెజండరీ యాక్టర్ కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కుమారులు మాత్రమే కాకుండా మొత్తం ఫ్యామిలీ ఈమ్యారేజికి రావడానికి అవకాశం ఉందని అంటున్నారు.

ఇకపోతే మార్చి 4వ తేదీన మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో అల్లు అర్జున్‌ని అత్యంత వైభవంగా పెళ్శికోడుకుని చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే అల్లు అర్జున్ పెళ్శికి సంబంధించినటువంటి పెళ్శి కార్డులు ముఖ్యఅతిధుల అందరికి పంపించడం జరిగింది. ఇది ఇలా ఉంటే మార్చి 21న అల్లు అర్జున్ తన ప్రస్తుతం నటిస్తున్నటువంటి బద్రినాద్ షూటింగ్‌లో పాల్గోనాల్సి ఉంది. ఇక అల్లు అర్జున్ హానీమూన్ గురించి ఇటీవల మీడియా ప్రశ్నించగా ప్రస్తుతానికి దాని గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, తీసుకున్న తర్వాత దానిని తెలియజేస్తానని అన్నారు.

ఇక ప్రోడ్యూసర్ అల్లు అరవింద్ తన కోడుకు పెళ్శి మాత్రం యావత్ భారతదేశం గోప్పగా చెప్పుకునేంత గోప్పగా జరపాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అది మాత్రమే కాకుండా ఈపెళ్శిని యావత్ టాలీవుడ్ గుర్తుంచుకోనే విధంగా ప్లాన్ చేసినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X