ఆటో డ్రైవర్‌కు ఇచ్చిన మాట కోసం మిస్టర్ పర్‌ఫెక్ట్
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఆటో డ్రైవర్‌కు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తన ప్రత్యేకతను చాటుకున్నాడు. మిస్టర్ పర్‌ఫెక్ట్, సూర్ స్టార్ అంటే కేవలం సక్సెస్‌ఫుల్ సినిమాలు తీయడమే కాదు మనల్ని ఈ స్థాయికి తెచ్చిన అభిమానుల కోసం ఏం చేయడానికికైనా సిద్ధపడాలని, ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని చాటిచెప్పాడు.
అమీర్ ఖాన్ తాను నటించిన '3 ఇడియట్స్' ప్రమోషన్లో పాల్గొన్నప్పుడు ఆటో డ్రైవర్ రామ్ లఖాన్ పాశ్వాన్‌కి ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ మేరకు ఆ ఆటో డ్రైవర్ కొడుకు పెళ్లికి హాజరైన నూతన వధూవరులు రాజీవ్, వేధితలకు శుభాకాంక్షలు తెలిపాడు. అమీర్‌ను చూసేందుకు జనం ఎగబడ్డారు. అక్కడ ఆయన దాదాపు గంట పాటు గడిపారు.
ఈ సందర్భంగా అమీర్ మాట్లాడుతూ....తాను సినిమానో, టీవీ షోను ప్రమోట్ చేసుకోవడానికి ఇక్కడకు రాలేదని, తన స్నేహితుడు రామ్ లఖాన్ పాశ్వాన్ ఇంట్లో శుభకార్యానికి వచ్చానని అమీర్ ఖాన్ స్పష్టం చేశాడు. 3 ఇడియట్స్ సినిమా ప్రమోషన్ సమయంలోనే రామ్ లఖాన్ పాశ్వాన్ తనకు చాలా సన్నిహితుడయ్యాడని అమీర్ ఖాన్ చెప్పుకొచ్చారు.
పై పెళ్లి విషయం పక్కన పెడితే....అమీర్ కంట ఇటీవల కన్నీరొలికింది. సామాన్య ప్రజల కష్టాల్ని తెలుసుకున్న ఈ బాలీవుడ్ స్టార్‌హీరో దుఃఖాన్ని అపుకోలేకపోయాడట. వివరాల్లోకి వెళితే...'సత్యమేవజయతే' పేరుతో రూపొందుతున్న ఓ టీవీషోకు అమీర్ ప్రయోక్తగా వ్యవహరిసున్నారు. వివిధ జీవన స్రవంతుల్లో సామాన్యులు ఎదుర్కొంటున్న కష్టాల్ని ప్రేక్షకులకు తెలియజెప్పే ఉద్ధేశ్యంతో ఈ కార్యక్షికమాన్ని నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా అమీర్ కార్యక్రమంలో పాల్గొన్న చాలా మంది సమస్యల్ని అడిగి తెలుకున్నాడట. మహిళల పట్ల వివక్ష, లైంగిక వేధింపులు లాంటి సమస్యలు విన్నప్పుడు అమీర్ ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయాడట. 'అమీర్ ఎంత సున్నిత మనస్కుడో మాకు అర్థమయింది. ఓ స్టార్‌లా కాకుండా కుటుంబ సభ్యుడిలా అందరి సమస్యల్ని ఓపిగ్గా విన్నారు అమీర్. ముఖ్యంగా మహిళలు తమ పట్ల జరిగిన అన్యాయాల్ని గురించి చెబుతున్నప్పుడు ఆయన దుఃఖాన్ని ఆపుకోలేక ఏడ్చేశాడు' అని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.


Click it and Unblock the Notifications











