యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్‌గా అమీర్ ఖాన్
బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ యూనిసెప్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యారు. యునిసెఫ్ అంటే ఐక్యరాజ్య సమితి బాలల నిధి(United Nations International Children's Emergency Fund). పిల్లల హక్కులతో పాటు వారి పౌష్టికాహారం అంశాలపై ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం కోసం వివిధ దేశాల నుంచి సెలబ్రిటీలు ఎంపిక కాగా, భారత్ లో యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్ గా అమీర్ ను ఎంపిక చేశారు. అమీర్ ఖాన్ ను మాత్రమే ఈ సారి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేయడానికి కారణం....తారే జమీన్ పర్, త్రీ ఇడియట్స్ చిత్రం ద్వారా అమీర్ పిల్లలకు, తల్లిదండ్రులకు చాలా చేరువవ్వడమే అని యునిసెఫ్ ప్రతినిధులు అంటున్నారు.
ఈ నెల 30వ తేదీన అమీర్ ఖాన్ అధికారికంగా యూనిసెప్ బాధ్యతలు చేపట్టనున్నారు. యూనిసెఫ్ తరుపున జరిగి అన్ని కార్యక్రమాల్లో ఇకపై అమీర్ తప్పకుండా పాల్గొనాల్సి ఉంటుంది. గతంలో బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, ప్రియాంక చోప్రాలు మాత్రమే ఈ అవకాశాన్ని దక్కించుకున్నారు. తాజాగా అమిర్ ఖాన్ ఈ అవకాశం దక్కించుకోవడంపై ఆయన అభిమానులు అభ్యంతం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











